గుర్రం జాషువా.. కవిత్వాలకు రచనలకు పెట్టిందిపేరు. తక్కువ కులంలో పుట్టి , తక్కువ కులంగా భావించబడడం తో పాటు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ,కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని,  ఈ సమాజంలో జరుగుతున్న మూఢాచారాలపై తిరగబడ్డ ఏకైక వ్యక్తి గుర్రం జాషువా. ఈయన 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లాలో వినుకొండ తాలూకాలోని చాట్రగడ్డ పాడు లో గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు  చిన్నతనం నుండి  సృజనాత్మక కూడా ఉండేది. అంతేకాకుండా బొమ్మలు గీయడం, పాటలు పాడడం వంటివి చేసేవారు .ఇక అనతికాలంలోనే రచయితగా మారి మేఘసందేశం, కుమారసంభవం, రఘువంశం వంటివి జూపూడి హనుమచ్ శాస్త్రి వద్ద నేర్చుకున్నారు. తర్వాత 36 గ్రంథాలు ,ఇంకా ఎన్నో కవితా ఖండికలు రాశి ప్రభంజనం సృష్టించారు..ఇదిలా ఉండగా, ఈయన జీవిత చరిత్ర  ఆధారంగా తీసుకొని ఒక బయోపిక్ ను నిర్మించడానికి సిద్ధమయ్యారు ఎల్బీ శ్రీరామ్ గారు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా ఎన్నో సినిమాలు చేసి ,ఆ తర్వాత రచయితగా మారిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయన రచయితగా ఆ ఒక్కటి అడక్కు, హిట్లర్, హలో బ్రదర్ వంటి సినిమాలకు పని చేశారు. అంతే కాదు మంచి డైలాగ్ రైటర్ గా కూడా నంది అవార్డును అందుకున్నాడు. ఇక మంచి రచయితగా పేరు తెచ్చుకున్న ఈయన, డైరెక్టర్ కావాలని కలలు కంటున్నారు. సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యలకు కళ్లకు కట్టినట్టు చూపించేలా ఈయన రచనలు ఉండేవి  అందుకు తగ్గట్టుగానే హార్ట్ ఫిల్మ్స్ అనే పేరుతో ఒక షార్ట్ ఫిలిం కూడా తీశాడు. వివాహ వ్యవస్థకు వున్న  ప్రత్యేకతను చాటే ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఈయనకు అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రముఖ రచయిత గుర్రం జాషువా బయోపిక్ ను , ఇతర రచయితల సహాయం కూడా తీసుకొని, కథను పూర్తిగా చేసే పనిలో పడ్డారు . అయితే ఈ సినిమా ఇక ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: