కొంతమంది సెలబ్రిటీలకు సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే ఓవర్ నైట్ స్టార్స్ గా లక్ కలిసొచ్చింది. మొదటి చిత్రంతోనే ఫ్యూచర్ సూపర్ స్టార్లు అన్పించుకున్నారు. ఇక వీళ్ళు వెండి తెరను ఏలడం ఖాయం అనుకుంటున్న తరుణంలో అంతా అయిపోయింది. వారు చేసిన తప్పులే శాపంగా మారి వారి స్టార్ డమ్ ను నేలమట్టం చేశాయి. మరి ఆ స్టార్స్ ఎవరు ? ఏంటా కథ తెలుసుకుందాం.  

బాలీవుడ్ నటుడు షైనీ అహుజా 2005లో తన మొదటి చిత్రం "హజారోన్ ఖ్వైషెయిన్ ఐసి"కి ఫిలింఫేర్ ఉత్తమ నటుడుగా తొలి అవార్డును గెలుచుకున్నాడు. తరువాత 'గ్యాంగ్ స్టర్స్', 'వోహ్ లామ్హే', 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' వంటి విజయాలను అందుకున్నాడు. కానీ 2009లో తన పని మనిషిపై అత్యాచారం చేసినందుకు అరెస్టు అయ్యాడు. అరెస్టు చేసిన 2 సంవత్సరాల తరువాత అంటే 2011లో షైనీ అహుజాకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీంతో ఫ్యూచర్ సూపర్ స్టార్ కెరీర్ కు బ్రేకులు పడ్డాయి.

'రామ్ తేరి గంగా మెయిలీ' నటి మందాకిని గుర్తుండే ఉంటుంది. ఆమెకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంవల్ల ఇబ్బందులు వచ్చాయి. మందాకినికి దావూద్ ఇబ్రహీంతో ఎఫైర్ ఉందని వార్తలు రావడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి. దీంతో  చిత్రనిర్మాతలు మందాకిని కెరీర్ కు కత్తె వేశారు. 1996లో ఆమె చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో పాటు యోగా బోధిస్తుంది.

నటుడు ఫర్దీన్ ఖాన్ స్టార్ ఫాదర్ ఫిరోజ్ ఖాన్ కుమారుడు. ఫర్దీన్ 1998 లో 'ప్రేమ్ అగ్గాన్' చిత్రంతో తొలిసారిగా అడుగుపెట్టాడు. ఈ చిత్రం ద్వారా ఫర్దీన్ ఖాన్‌కు ఫిలింఫేర్ ఉత్తమ తొలి అవార్డును కూడా ఇచ్చారు. కానీ 2001లో కొకైన్ కొనడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యాడు. దీంతో అతని కెరీర్ కు చెక్ పడింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఫర్దీన్ ఖాన్ సినిమాలకు, నటనకు కూడా దూరంగా ఉన్నారు.

అనేక హిందీ చిత్రాలలో నటించిన నటి మోనికా బేడి అండర్ వరల్డ్ డాన్ అబూ సేలంతో సంబంధం కారణంగా సినిమాలకు దూరమైంది. అప్పట్లో అబూ సలేంతో ఆమె ప్రేమకథ సంచలనం సృష్టించింది. .

90వ దశకపు నటి మమతా కులకర్ణి విషయంలోనూ ఇదే జరిగింది. 'కరణ్ అర్జున్', 'వక్త్ హమారా హై', 'సబ్సే బడా ఖిలాడి', 'బాజీ', 'చైనా గేట్' వంటి చాలా గొప్ప చిత్రాలను చేసిన మమతా కులకర్ణి కి గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ తో సంబంధం ఉండడం, 2016లో మమతా అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లర్ శ్యామ్ విజయ్ గిరి అలియాస్ విక్కీ గోస్వామితో ఎఫ్రెడిన్ మాదకద్రవ్య అక్రమ రవాణా కేసులో ఉండడం కూడా ఆమె కెరీర్ ను నాశనం చేసింది. .

సుభాష్ ఘాయ్ చిత్రం 'సౌదగర్'తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన మనీషా కొయిరాలా మద్యం కారణంగా స్టార్ డమ్ కోల్పోయింది. 1999 సమయంలో మనీషా తెగ బిజీ అయిపోయి ఒత్తిడిని అధిగమించడానికి మద్యాన్ని ఆశ్రయించింది. ఆమెకు కోపం కూడా ఎక్కువ అయ్యిందట. రానురానూ ఆమె ప్రవర్తన మితిమీరుతుండడంతో దర్శకనిర్మాతలు ఆమెకు దూరమయ్యారు. 2012లో మనీషాకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ ఆఫర్లు మరింత తగ్గాయి. తరువాత మనీషా క్యాన్సర్ నుండి కోలుకుని రీఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: