ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల కు సంబంధించిన అంశాలు ఎన్నో ఎన్నో వైరల్ గా మారుతున్నాయి.  సినీ సెలబ్రిటీల కు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా దాన్ని పెద్దగా  చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న రాజీవ్ కనకాల యాంకర్ సుమ ఇద్దరూ కూడా విడిపోయారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇలా ఇద్దరు విడిపోయారు అని వస్తున్న వార్తలను సుమ రాజీవ్ కనకాల ఎప్పటికప్పుడు డైరెక్టుగా ఇండైరెక్టుగా ఖండిస్తూనే వస్తున్నారు. కానీ వీరిద్దరి పై వస్తున్న రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఇక వీరిపై వస్తున్న పుకార్లకు కొన్ని కొన్ని సార్లు ఏకంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలతోనే చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ రూమర్లు మాత్రం ఆగలేదు



 రీసెంట్ గా నారప్ప సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు రాజీవ్ కనకాల  అయితే ఇక ఇలా ఇంటర్వ్యూలలో చాలామంది యాంకర్లు ఆయన పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు  ఈ క్రమంలోనే ఇక మీరు మీ భార్య విడిపోయారని ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఉంది అంటూ అడుగగా.. ఇక అసలు విషయం చెప్పేశాడు రాజీవ్ కనకాల. సుమ నేను విడిపోలేదు గొడవలు కూడా ఏం లేవు.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ స్పష్టం చేశారు. అయితే ఈ రూమర్లకు కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు.



 మొదట్లో మేం పిల్లలతో కలిసి l&t లో ఉండే వాళ్ళం.. ఇక అమ్మ చనిపోవడంతో నేను మా ఫాదర్ ని తీసుకుని వెళ్లి మణికొండలో సొంత ఇంట్లోనే ఉంటున్నాను అంటూ తెలిపారు రాజీవ్ కనకాల. ఇక ఆ సమయంలో సుమ తో విడిగా ఉండాల్సి వచ్చింది. అంతకు ముందు ఎల్ అండ్ టీ  లో మేము ఉంటున్న ఫ్లాట్ కి నాన్న తీసుకువెళదాం అని అనుకున్నప్పటికీ ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉంది   అది మా ఇంట్లో పెట్టడానికి వీలు లేదు. అందుకే ఇలా నాన్న తో పాటే నేను ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కొన్నాళ్ళు వరకు విడిగానే ఉన్నాం.. అంతలోనే సుమ రాజీవ్   విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అంటు రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: