నందమూరి బాలకృష్ణ సినిమాని ఇష్టపడని మాస్ ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా బాలయ్య పలికే భారీ డైలాగ్స్, యాక్షన్, డాన్స్ ల కోసమే ఆయన సినిమాలను చూస్తుంటారు ప్రేక్షకులు. ఇక బాలయ్య సినిమాలో ఇంటర్వెల్ బ్యాంకు కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే.బాలయ్య నటించిన నరసింహా నాయుడు,సింహ,సమరసింహరెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో ఇంటర్వెల్ బ్యాంకు ఓ రేంజ్ లో ఉంటాయి.ఇక సమరసింహరెడ్డి సినిమాలో ముందు వంట వాడిగా కనిపించే బాలయ్య తరువాత తన ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ ఇంటర్వెల్ బ్యాంకు లో తెలుస్తోంది.

డాన్స్ మాస్టర్ గా నరసింహనాయుడు లో ముందు కనిపించే గతం ఎంటో ఇంటర్వెల్ బ్యాంకు లో కనిపిస్తుంది.ఇక ఈ రెండు సినిమాలు ఎంత హిట్ కొట్టాయో తెలిసిందే.ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' అనే హ్యాట్రిక్ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సంహ,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.దీంతో భారీ అంచనాలు అఖండ సినిమాపై ఉన్నాయి.బాలయ్య గత హిట్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ రేంజ్ లో ఉందో ఈ సినిమాలో కూడా అలానే ఉండబోతోందని సమాచారం.సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నారట.ముందు ఒక సాధారణ పాత్రలో కనిపిస్తారు బాలయ్య.

ఇందులో ఒకటి అఘోర పాత్ర అని తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం అఘోర పాత్ర లో కనిపించాబోతున్నారు.ఇక ఆ అఘోర పాత్రలో ఎంట్రీ ఇచ్చే బాలయ్య ను చూసి ఫ్యాన్స్ కి గుగ్స్ బామ్స్ రావడం ఖాయమట.ఇక సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్ర పోషించారు.ఈయన కూడా అఘోర పాత్రలోనే కనిపిస్తారని తెలుస్తోంది.ఇంటర్వెల్ కి ముందు బాలయ్యకు మార్గ దర్శకంగా ఉండే ఒక పాజిటివ్ పాత్రలో ఎంట్రీ ఇస్తారు జగపతిబాబు.టీజర్ లోని డైలాగ్ తోనే ఇంటర్వెల్ కార్డు పడుతుంది అని సమాచారం.ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన నటీచబోతుంది.తమన్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ లో వినాయక చవితి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: