బాలీవుడ్ ను షేక్ చేసిన రాజ్ కుంద్రా పోర్ణ్ వీడియోల బాగోతంలో రోజుకో అంశం తెర‌పైకి వ‌స్తూ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై న‌టి గెహ‌నా వ‌సిష్ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ముందు నుండి రాజ్ కుంద్రా కేసుతో లింక్ ఉన్న భామ‌లు కుంద్రాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అప్ప‌ట్లో నటి షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా ప‌రువు తీసేలా మాట్లాడింది. రాజ్ కుంద్రా అనుచ‌రులు మ‌రియు ఆయ‌న త‌న‌ను బ‌ల‌వంతం చేసి వీడియోలు తీయించార‌ని ఆరోపించింది. విచార‌ణ‌లో కూడా షెర్లిన్  ఆ విష‌యాన్నే నొక్కి చెప్పింది. ఇక పోర్న్ వీడియోల కేసులో షెర్లిన్ ను ముంబై పోలీసులు ఫిబ్ర‌వ‌రిలో అరెస్ట్ చేసి 133 రోజులు జైల్లోనే ఉంచారు. 

కాగా ఇటీవ‌ల షెర్లిన్ చోప్రా బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదిలా ఉంటే షెర్లిన్ చోప్రా పై తాజాగా న‌టి గెహ‌నా వ‌సిష్ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అస‌లు త‌ప్పంతా షెర్లిన్ దే అంటూ గెహ‌నా వ్యాఖ్యానించింది. అంతే కాకుండా రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు చేయ‌డానికి కార‌ణం షెర్లినే అంటూ గెహ‌నా ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. షెర్లిన్ ఇప్ప‌టి నుండి కాద‌ని 2012 నుండే పోర్న్ వీడియోల‌ను తీస్తోంద‌ని వ్యాఖ్యానించింది.

కానీ రాజ్ కుంద్రాకు కేవ‌లం రెండున్న‌రేళ్ల నుండే షెర్లిన్ తో ప‌రిచ‌యం ఉంద‌ని గెహ‌నా చెప్పింది. ఇక రాజ్ కుంద్రా చేసిన సాయంతో షెర్లిన్ కోట్ల రూపాయ‌లను సంపాదించుకుంద‌ని గెహ‌నా చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం షెర్లిన్ ఈ స్థాయిలో ఉండేందుకు కార‌ణంగా కూడా రాజ్ కుంద్రానే అని చెప్పింది. కానీ షెర్లిన్ పాపులారిటీ కోస‌మే రాజ్ కుంద్రా అత‌డి భార్య శిల్పా శెట్టి ల పేర్ల‌ను వాడుతూ ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని గెహానా వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: