బాలయ్య పక్కా మాస్ హీరో. ఈ విషయంలో ఎవరికీ డౌట్లు లేవు. బాలయ్య ఎనర్జీ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. ఆయన సినిమాని అంతలా ప్రేమిస్తారు. ఇక బాలయ్యతో చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు. హిట్లు కొట్టారు.

కొంతమంది డైరెక్టర్లు బాలయ్య బాడీ లాంగ్వేజ్ ని బాగా గమనించి ఆయనతో సూపర్ హిట్లు కొట్టారు. అలాంటి వారిలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒకరు. ఆయన బాలయ్యతో సినిమా చేస్తే హిట్ అన్న బ్రాండ్ పడిపోతుంది. ఈ ఇద్దరు కలసి చేస్తున్న మూడవ సినిమావే అఖండ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి బోయపాటిని, బాలయ్యని ఒక ఎత్తుకు ఎత్తేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం బాలయ్య ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

బాలయ్యని ఆటం బాంబు అనేశారు. ఇక రాజమౌళికి బాలయ్యని ఎలా డైరెక్ట్ చేయాలో తెలుసు అన్నారు. ఈ ఇద్దరూ తమ స్రీక్రెట్లను అందరికీ చెప్పాలని కోరారు. ఇలా రాజమౌళి మాట్లాడుతూంటే బాలయ్య ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోయారు. అయితే రాజమౌళి ఇంకా ఏదో చెబుతాడని ఆశపడిన ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ కలిగిందిట.

వారు ఎదురుచూస్తున్నది రాజమౌళి తో బాలయ్య మూవీ ఉంటుందని, ఆ విషయాన్ని రాజమౌళి ప్రకటిస్తాడు అనుకున్నారు. అయితే రాజమౌళి అంతటితో ముగించారు. అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత ఫ్యాన్స్ గట్టిగా ఏదో అడిగారు. కానీ అది రాజమౌళికి వినబడలేదు. అయితే బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్నది మాత్రం రాజమౌళి కాంబోనే అంటున్నారు. మరి రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఆయన బాలయ్యతో మూవీ చేస్తారా అన్నదే ఇక్కడ చర్చ. చూడాలి మరి ఏం జరుగుతుందో. అన్నట్లు ఎపుడో సింహద్రీ మూవీనే బాలయ్యతో రాజమౌళి తీయాల్సింది. అది నాడు కుదరలేదు. మళ్ళీ అలాంటి సబ్జెక్ట్ కుదిరితే ఈ కాంబో కూడా సెట్స్ మీదకు రావడం ఖాయమే.
మరింత సమాచారం తెలుసుకోండి: