మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన 'ఆఖండ' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ రోజు విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా అఘోర గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయింది.

 ఎప్పటిలాగే బోయపాటి మరోసారి రొటీన్ కమర్షియల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్ అంశాలతో అఘోర అనే ఓ కొత్త పాయింట్ని తీసుకొని దాన్ని సినిమాగా తీశాడు. అయితే మాస్ ఆడియన్స్, నందమూరి ఫాన్స్ కి తప్పా మిగతా ఆడియన్స్కి ఈ సినిమా నచ్చే అవకాశాలు తక్కువ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి బోయపాటి ఒకే తరహా కథాంశంతో సినిమాలు తీయడం ఆడియన్స్కి నచ్చడం లేదు. తన కథా, కథనాల విషయంలో బోయపాటి సరికొత్తగా ఆలోచించాలని కొందరు అంటున్నారు. అఖండ తో బోయపాటి ఈసారి సరికొత్తగగా మ్యాజిక్ చేస్తాడని విడుదలకు ముందు అంతా అనుకున్నారు.

 కానీ మళ్లీ రొటీన్ మాస్ కమర్షియల్ సినిమానే డెలివరీ చేశాడని విడుదల తర్వాత తెలిసిపోయింది. అయితే ఇప్పుడు అఖండ తర్వాత బోయపాటి అల్లుఅర్జున్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బన్నీతో కూడా ఇదే ఫార్మేట్ ని కనుక కంటిన్యూ చేస్తే కచ్చితంగా నిరాశ తప్పదు అని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకే బన్నీతో సరైనోడు వంటి మాస్ సినిమా తీశాడు బోయపాటి. మొదట్లో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.ఆ తర్వాత మెల్ల మెల్లగా బోయపాటి యాక్షన్ కి అల్లు అర్జున్ మాస్ పర్ఫామెన్స్ తోడవడంతో సినిమా హిట్ అయింది. అలా ప్రతి సారి హిట్ అవ్వడం అంటే కష్టమే. అందుకే ఈసారైనా బన్నీ తో చేసే ప్రాజెక్ట్ విషయంలో బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకొని గతంలో చేసిన తప్పులను ఈ ప్రాజెక్టు విషయంలో చేయకుండా ఉంటే బాగుంటుందని అంటున్నారు. ఒకవేళ బోయపాటి అలా చేయకుండా మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో వెళితే బన్నీ పని అంతే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: