సినిమా ఇండస్ట్రీలో కొంత మంది మధ్య స్నేహబంధం ఎలా ఉంటుంది అంటే వారిద్దరి మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ఎన్ని అగాధాలు వచ్చినా కడదాక వారి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. అలా సినిమా పరిశ్రమలో కొన్ని అనుబంధాలు సినిమా ఫ్లాపయితే తెగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత వారు కలసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉండవు. వీరిద్దరు కలిసి సినిమా చేసేదాకా వారి మధ్య మాటలు కూడా ఉండవు అనేది ఇప్పటికే చాలాసార్లు స్పష్టం అయింది. సినిమా పరిశ్రమలో ఎంతో మంది స్నేహితులు ఈ కారణాల వల్ల ఎక్కువ రోజులు మాట్లాడుకోలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఓ హీరో దర్శకుడు విషయంలో సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా వారిద్దరి మధ్య స్నేహబంధం ఇంకా కొనసాగుతూనే ఉండడం సినిమా పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూపర్ స్టార్ గా మహేష్ బాబు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తున్నాడో అందరికీ తెలిసిందే. మరోవైపు దర్శకుడిగా రచయితగా ప్రేక్షకులను అలరిస్తున్న త్రివిక్రమ్ కు ఈ మహేష్ బాబు కు మధ్య అనుబంధం ఎంతటి స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరి కలయిక లో వచ్చిన రెండు సినిమాలు కూడా విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన సినిమాలే. 

ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో మూడో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో చేయాలని త్రివిక్రమ్ భావించగా దీనికి సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయింది. ఇది పాన్ ఇండియా సినిమాగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మహేష్ రాజమౌళితో సినిమా చేయవలసి ఉండగా త్రివిక్రమ్ తో సినిమా అనగానే దాన్ని పక్కన పెట్టి మరి ఈ సినిమా కి ఓటు వేశాడట మహేష్. దీనికి తోడు రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉండటం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల మహేష్ ఈ సినిమాను చేయవలసి వచ్చింది. త్రివిక్రమ్ తో కలిసి మహేష్ అతడు మరియు ఖలేజా అనే రెండు సినిమాలు చేయగా అవి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: