తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ది సుదీర్ఘ ప్రయాణం. 'దేవి' సినిమా మొదలు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు చేస్తూనే ఉన్నారు ఈ రాక్ స్టార్. దేవి సినిమాతో మొదలైన ఆయన కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. కేవలం తాను అందించిన సంగీతం వలనే హిట్ అయిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. టాలీవుడ్ లో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు చాలా డిమాండే ఉంది. స్టార్ డైరెక్టర్లు, హీరోలు సైతం డిఎస్పీ మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తుంటారు.

అయితే ఇపుడు దేవి శ్రీ ప్రసాద్ కు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇప్పటి వరకు ఈ రాక్ స్టార్ సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా అప్పుడప్పుడు పాటల మద్యలో హీరోలతో స్క్రీన్ పై కనిపించి సందడి చేశారు. అయితే ఈసారి అలా కనిపించి ఇలా వెళ్లిపోవడం కాదు ఒక పాత్ర కూడా పోషించబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి.  పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్' కి  దేవిశ్రీ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా పోషించబోతున్నారు అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలయ్యింది.

ఈ చిత్రంలో పవన్ కోసం ఒక రోల్ చేయడానికి దేవి శ్రీ ఒప్పుకున్నారు అని సమాచారం. అయితే ఈ రోల్ పవన్ కోసమో, లేదా దేవి శ్రీ ప్రసాద్ కోసమో సృష్టించింది కాదట. కథ పరంగా ఒక పాత్రకు అవకాశం ఉంది ఆ పాత్రను దేవి దగ్గర చేయిస్తున్నారని వినికిడి. ఈ పాత్రా ఠాగూర్ సినిమాలో వివి వినాయక్ పోషించిన పాత్ర లాగా సీరియస్ గా ఉంటుందట. కానీ అంత నిడివి ఉండకపోయినా కొద్ది సేపు అని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వినడానికి బాగుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: