ఏ సినిమాకైనా కథ ఎంపిక చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అనేది ఆ కథే నిర్ణయిస్తుంది. కథ బాగుంటే ఎంత చిన్న హీరో కైనా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది. అదే కథ బాగా లేకుంటే ఎంత పెద్ద హీరో కైనా భారీ ఫ్లాప్ ను తీసుకువస్తుంది. ఆ విధంగా మన హీరోలు అందరూ కూడా కథ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ ముందుకు పోతున్నారు. అయితే ఎంత పెద్ద హీరో అయినా కొన్ని కొన్ని సార్లు కథ ను జడ్జ్ చేయడం అనేది అన్నిసార్లు కుదరదు.

ప్రతి సినిమా హిట్ చేయడం అనేది జరగదు ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా రిలీజ్ చేసిన ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ విధంగా ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అవడానికి కథలో దమ్ము లేకపోవడమే ప్రధాన కారణం అని కొంతమంది సినిమా విశ్లేషకులు ఇప్పటికే వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అపజయాలను చవి చూశాడు. 

ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమా మిస్ ఫైర్ అయ్యిందనే చెప్పాలి. ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన సినిమా ఈ విధంగా ఫ్లాప్ అయినందుకు చిరంజీవి కూడా ఎంతో బాధ పడి ఉంటారు. ఇక నుంచి అయినా ఆయన కథల విషయంలో ఒక స్థాయిలో ఆలోచించాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో చరణ్ కూడా నటించడం. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కోరుకున్నాడు. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సినిమా మరోసారి నిరూపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: