టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆ విధంగా వారు చేసే ఈ ప్రయోగాలు కొన్ని సార్లు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కొన్నిసార్లు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి అయితే వాటినుంచి వాళ్ళు ఏం నేర్చుకొని తమ సినిమాల పట్ల జాగ్రత్త వహిస్తారో వారే సక్సెస్ అవుతారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రయోగాలు చేయడంలో అందరికంటే ముందున్నాడు దర్శకుడు కొరటాల శివ.

ఇప్పటిదాకా ఆయన తన ప్రతి సినిమాలో ఓ ప్రయోగాత్మక ను ప్రయోగించారు. అయితే అన్ని సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి. ఆచార్య సినిమా మాత్రం ఆయనకు మంచి ఫలితం ఇవ్వ లేకపోయింది అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి తో కలసి దర్శకుడు కొరటాల శివ కూడా ఒక ప్రయోగాత్మక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ కొరటాల శివ అందరికంటే ఎక్కువగా ప్రయోగాలు చేస్తాడు కాబట్టి ఆచార్య తోనూ ఆయన ప్రయోగాత్మక సినిమా చేశాడు కానీ అది ఫలితాన్ని ఇవ్వలేదు మెగాస్టార్ కు కూడా ఎంతో నిరాశ ను ఇచ్చింది అని చెప్పడం జరిగింది.

ఆ విధంగా కొరటాల శివ  ఎన్టీఆర్ తో మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో అన్న అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా పనిచేసే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కాకుండా సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండటం జరిగింది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పుడే ఈ విషయాన్ని కూడా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ అభిమానులకు ఇది సరికొత్త రకమైన అనుభూతి అనే చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోగా రాబోతున్న కొరటాల శివ సినిమాకి ఈ సంగీతదర్శకుడు నిజంగా ప్రయోగాత్మకమైన విషయం అని చెప్పాలి. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: