కొందరు హీరోయిన్లు సినిమా అంటే ఎంటర్‌టైన్ మెంట్ అంటూ అన్నీ చేయడానికి సిద్దంగా ఉంటారు..కథ డిమాండ్ వుంటే ఎటువంటి పాత్రనైన చేయడానికి రెడీ అవుతారు..అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం కథ బాగుంటే సినిమాలను చెస్తామని, లేకుంటే లేదని తెగెసి చెబుతున్నారు.. అలాంటి వాళ్ళలో సాయి పల్లవి కూడా ఒకటి..ఫిదా సినిమాతో అభిమానుల్ని సంపాదించుకొని పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి వరుస హిట్ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారి ఎంతో మంది యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది సాయి పల్లవి.


నటనతో, డ్యాన్స్ తో అందర్నీ ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తూనే ఉంది. అందరి హీరోయిన్స్ లా మేకప్ లు వాడకపోవడం, చాలా సాంప్రదాయంగా, సింపుల్ గా, పద్దతిగా ఉండటంతో మరింతమంది ఆమెని అభినందిస్తున్నారు.చాలా స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ, ఎక్స్‌పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ మిగతా హీరోయిన్స్ కి నేను చాలా డిఫరెంట్ అంటుంది సాయి పల్లవి. ఇక ఎన్ని డబ్బులిచ్చినా కొన్ని ప్రకటనలు, ఐటెం సాంగ్స్ లాంటివి చేయను అని గతంలోనే చెప్పింది. అందుకే సాయి పల్లవి అంటే అందరికి ఇష్టం. ప్రస్తుతం సాయి పల్లవి జులై 1న విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది..ఈ సందర్భంగా మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.పుష్ప మూవీలోని 'ఊ అంటావా మావ', రంగస్థలంలోని 'జిగేలు రాణి' లాంటి ఐటెం లేదా స్పెషల్ సాంగ్స్ ఆఫర్ వస్తే చేస్తారా అని అడగడంతో సాయి పల్లవి మాట్లాడుతూ.. ”ఐటెం సాంగ్స్‌ నాకు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇస్తాము అని భవిష్యత్తులో ఆఫర్స్ వచ్చినా చేయననే చేప్తాను. ఎందుకంటే నాకు డ్రెస్సింగ్ కరెక్ట్ గా ఉండకపోతే నచ్చదు. ఆ సాంగ్స్ లో వేసే బట్టలు నాకు సెట్ అవ్వవు. డ్రెస్సింగ్ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు” అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది..డబ్బులు కోసం నేను వ్యక్థిత్వాన్ని పక్కన పెట్టను అని మరోసారి క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: