టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్  టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన సుకుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్య మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే ఇటు ప్రేక్షకుల నుండి,  అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న సుకుమార్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం  ,  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప పార్ట్ 1 మూవీ ల విజయాలతో హ్యాట్రిక్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న సుకుమార్ మరి కొన్ని రోజుల్లో పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అవగానే సుకుమార్ విజయ్ దేవరకొండ తో కానీ లేక మరో హీరో తో కానీ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సుకుమార్ సలమూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.  

సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ రెండు మూవీ లు కంప్లీట్  అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతునట్లు తెలుస్తోంది. ఇది వరకే సూప్ట్ స్టార్ మహేష్ బాబు , సుకుమార్ కాంబినేషన్ లో 1 నేనొక్కడినే మూవీ తెరకెక్కింది. కాక పోతే ఆ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: