టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నిఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ మూవీ తో మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్న నిఖిల్ ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినా కానీ పెద్దగా విజయాలు మాత్రం ఈ హీరోకు దక్కలేదు.

అలాంటి సమయం లోనే నిఖిల్ నటించిన స్వామి రారా సినిమా మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా నిఖిల్ కి మంచి గుర్తింపు ను కూడా తీసుకు వచ్చింది. స్వామి రారా సినిమా తర్వాత నిఖిల్ నటించిన కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు మంచి విజయాలను సాధించడం, అలాగే ఈ సినిమాల కథలు కూడా కాస్త భిన్నంగా ఉండటంతో నిఖిల్ కథల ఎంపిక కూడా బాగుంటుంది అనే ప్రశంసలు ఈ హీరోకు దక్కాయి.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ , చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

కార్తికేయ 2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్  హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే నిఖిల్ నటించిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. తాను నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కోసం నిఖిల్ ఒక డేరింగ్ డెసిషన్ ను తీసుకున్నాడు. అది ఏమిటి అనుకుంటున్నారా... కార్తికేయ 2 సినిమాకు హిందీలో కూడా తానే డబ్బింగ్ ను చెప్పుకుంటున్నట్లు నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇలా కార్తికేయ 2 సినిమా కోసం నిఖిల్ హిందీ లో కూడా డబ్బింగ్  చెప్పుకోబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: