నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే . బాలకృష్ణ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించి నప్పటికీ బాలకృష్ణ తన అద్భుతమైన డైలాగ్ లతో ,  అద్భుతమైన వాక్చాతుర్యం తో అన్ స్టాపబుల్ టాక్ షో ను అద్భుతమైన విజయం సాధించే లా చేశాడు .

అన్ స్థాపబుల్ సీజన్ 1 అద్భుతమైన విజయం సాధించడం తో ఆహా 'ఓ టి టి' నిర్వాహక బృందం ఈ టాక్ షో కు సీజన్ 2 ని కూడా ప్లాన్ చేసింది . ఇప్పటికే ఈ టాక్ షో సీజన్ 2 కి సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఆహ నిర్వాహక బృందం విడుదల చేసింది . ఇది ఇలా ఉంటే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ సీజన్ 2 లో ప్రముఖ రాజకీయ నాయకులు అయి నటువంటి నారా చంద్రబాబు నాయుడు ,  మరియు నారా లోకేష్ ఒక ఎపిసోడ్ కు ముఖ్య అతిథులు గా రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాగే అన్ స్టాపబుల్ టాక్ షో లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఈ రోజు జరగనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అన్ స్థాపబుల్ సీజన్ 2 కోసం బాలకృష్ణ అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: