టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన్న తన అందం అభినయంతో కుర్ర కారు మనసులు కొలగొట్టి నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ వరస షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ లో బాగా వేయాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ అవకాశాలపై కన్నేసింది.


 ఇప్పటికే అక్కడ మూడు సినిమాల్లో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే రష్మిక మందన్న నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన స్వయంవరం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి. ఒకవేళ మీకు స్వయంవరం జరిగితే స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అంటూ యాంకర్ ప్రశ్నిస్తుంది.


 ఇక ఇదే విషయం పై స్పందించిన రష్మిక మందన్న తాను వర్క్ చేసిన హీరోలు అందరూ ఉండాలి అంటూ ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇక ఆ తర్వాత రణబీర్ కపూర్, విజయ్ తలపతి, అల్లు అర్జున్ ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పింది ఈ బ్యూటీ. ఇక ఇలా ముగ్గురు పెళ్లి అయిన హీరోలను ఎంచుకుంది రష్మిక మందన. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా లో నటించింది. పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో రష్మికకు ఒక్క సారిగా క్రేజ్ పెరిగి పోయింది అని చెప్పాలి. రష్మిక చేసిన గుడ్ బై సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: