పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలతో ఈయన ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశ పరిచాడు..
దీంతో ఇప్పుడు అందరి ఆశలు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా మీదనే ఉన్నాయి.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా ఇటీవలే టీజర్ వచ్చింది.. అయోధ్యలో మేకర్స్ ఈ ఆదిపురుష్ టీజర్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేసారు..ఈ టీజర్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ ట్రోల్స్ రావడం వెనుక ఒక బాలీవుడ్ స్టార్ హీరో హస్తం ఉంది అని ఇప్పుడు ఓ రేంజ్ లో ఒక వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.. మాములుగా బాలీవుడ్ లో ఎవరైనా పైకి వస్తున్నారంటే వారిని కిందకి తొక్కేస్తూ ఉంటారు.
ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు బయట పడింది.. ఇక ఇప్పుడు ప్రభాస్ ఎదుగుదలను కూడా చూడలేని ఒక బాలీవుడ్ బడా ఫ్యామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో ఇలా ట్రోల్స్ చూపిస్తూ ప్రభాస్ ను డీగ్రేడ్ చేసి చూపించాలని వెనకుండి అలా కథను నడిపిస్తున్నాడట. బాలీవుడ్ లో అక్కడి హీరోలను సైతం వెనక్కి నెట్టేంత క్రేజ్ ను ప్రభాస్ సంపాదించు కున్నాడు. అందుకే అతడి ఎదుగుదలను తొక్కేయాలని ఈ స్టార్ హీరో అనుకుంటున్నాడట.
అందులోను ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంటర్ అయినా తర్వాత ఈ స్టార్ హీరో క్రేజ్ పడిపోయింది అని అందుకే ఈయన ప్రభాస్ ను ఎలాగైనా పడేయాలని ట్రై చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.. మరి ఆ బడా హీరో ఎవరు? ఏంటో? తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. ఈ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఈయనను జాగ్రత్తగా ఉండాలంటూ.. ఈ ట్రోలర్స్ ను గట్టిగ ఎదుర్కోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
ఇక ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.. సీతగా కృతి సనన్ నటిస్తుంది.. లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: