రాజేంద్ర ప్రసాద్ అలీ గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే. అలీతో ఉన్న చనువు వల్లే రాజేంద్ర ప్రసాద్ ఆ విధంగా కామెంట్లు చేసినా ఎక్కువమందికి ఆ కామెంట్లు అయితే నచ్చలేదు. ఈ వివాదం గురించి తాజాగా తీన్మార్ మల్లన్న రియాక్ట్ అవుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
దాన్ని హీరోయిన్ ను చేసింది నేనే అంటూ రోజా గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లపై సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి. అలీ ఒక ముస్లిం బిడ్డ అని రాజేంద్ర ప్రసాద్ అనే ఫాల్తు గాడు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ మనిషివా గాడిదవా అని చిరు, బాలయ్యలను ఉద్దేశించి ఆ కామెంట్ చేయగలవ అని ఆయన ప్రశ్నించారు.
 
అలీ ముస్లిం కాబట్టి పేద వర్గాలకు చెందిన బిడ్డ కాబట్టి ఇలా మాట్లాడతావా అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ కు సిగ్గుందా? ఇంత బలుపా? అంటూ ఆయన ప్రశ్నించారు. అలీ 1200 1300 సినిమాల్లో నటించారని అలీ పైకి నవ్వుతున్నారని ఆయన వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ ను ఎవరైన ఇదే మాట అంటే ఊరుకుంటాడా అని ఆయన అన్నారు.
 
అలీ తల్లిని అవమానించేలా కామెంట్లు చేయడం ఏంటని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మైనార్టీ బీసీలకు దొరికితే రాజేంద్ర ప్రసాద్ ను తన్నడం ఖాయమని ఆయన వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ అలీకి క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుస వివాదాల ద్వారా రాజేంద్ర ప్రసాద్ వార్తల్లో నిలుస్తున్నారు. అలీ కూడా రాజేంద్ర ప్రసాద్ పై సీరియస్ అయ్యి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: