
మొదట ఇండస్ట్రీలోకి డేగ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత తమిళ్ ,తెలుగు, హిందీ వంటి భాషలలో కూడా నటించింది. కంచె సినిమాతో తెలుగులో స్టార్ డం అందుకుంది. ఆ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ప్రగ్యా జైస్వాల్. పలు రకాల చిత్రాలలో స్పెషల్ సాంగులలో కూడా నటించింది. బాలయ్యతో నటించిన అఖండ, డాకు మహారాజు వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం అఖండ 2 లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న ఇక నిరంతరం సోషల్ మీడియాలో అందాల జాతర మాత్రం చేస్తూ ఉంటుంది.
తాజాగా సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.. స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయాలని ఉందంటూ చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు శుభమన్ గిల్.. ఈ విషయం విన్న ప్రగ్యా అభిమానులు వామ్మో ప్రగ్యా గురి మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా తో గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వినిపించాయి తరచూ అప్పుడప్పుడు ఏ జంట ఎక్కడో ఒకచోట కనిపిస్తూ ఉండేది. కానీ ఈమధ్య బ్రేకప్ అయినట్లుగా రూమర్స్ వినిపిస్తున్న ఇలాంటి సమయంలో ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..