
జాన్వీ-ఖుషి కాకుండా శ్రీదేవికి ఇంకో కూతురు కూడా ఉందని మీకు తెలుసా.. ఆమె కూడా బిగ్ స్టార్ హీరోయినే..!

ఆమె స్థానాన్ని ఏ హీరోయిన్ అందుకోదు .. అందుకోలేరు .. అందుకోబోదు అని చెప్పడంలో సందేహమే లేదు . ఆమె జీవితంలో చాలా అందమైన మలుపులు ఉన్నాయి. కొన్ని భావోద్వేగా క్షణాలు కూడా ఉన్నాయి. అవి ఎప్పటికీ అభిమానులు మర్చిపోలేరు . కాగా శ్రీదేవి మరణం ఇప్పటికి ఒక మిస్టరీగానే ఉంది . శ్రీదేవి మన మధ్య లేకపోయినా సరే ఆమెని అభిమానించి ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. . కాగా శ్రీదేవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తల్లి అంత స్థాయి అందుకుంటుంది అని చెప్పలేము కానీ ఖచ్చితంగా శ్రీదేవి కూతురుగా మంచి మార్కులు దక్కించుకుంటుంది అంటున్నారు అభిమానులు.
ఇలాంటి మూమెంట్లోనే శ్రీదేవికి సంబంధించిన మరికొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి . శ్రీదేవి తన మూడో కూతురిగా పాకిస్తాన్ నటి సజల్ అలీ అని ఎన్నోసార్లు సంబోధించింది . అది ఆమె ఏర్పరచుకున్న బంధం అని .. మాది చాలా చాలా స్పెషల్ అని కూడా చెప్పుకొచ్చింది . 2017 లో వచ్చిన మామ్ చిత్రంతో శ్రీదేవి 300 సినిమా కావడమే కాకుండా ఆమె జీవితంలోని చివరి ప్రాజెక్టు కూడా కావడం విశేషం గమనార్హం. ఇందులో పాకిస్తాన్ నటి సజల్ అలీ - శ్రీదేవి కూతురిగా నటించారు .
కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు . సినిమా షూటింగ్ పూర్తయ్యలోపు ఇద్దరి మధ్య అభిమానం స్నేహంగా మారి చివరికి ఒక తల్లి కూతుర్ల బంధం గా మారిపోయింది . ఈ విషయాన్ని శ్రీదేవి ఎన్నోసార్లు చెప్పారు. గతంలో మీడియాతోను శ్రీదేవి ఈ విధంగా వివరణ ఇచ్చింది. " నా మూడో కూతురు నాకు ఇంకో అమ్మాయి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది . చాలా చక్కగా మాట్లాడుతుంది. చాలా మంచి అమ్మాయి అంటూ శ్రీదేవి చెప్పుకొచ్చారు".
ఇది పరోక్షంగా జాన్వి - ఖుషి కి మరో సోదరిగా ఆమె అంగీకరించినట్లు కూడా ఆమె మాటల ద్వారా తెలిసిపోతుంది. కాగా శ్రీదేవి పట్ల సజల్ కూడా అంతే అనుబంధం చూపించేది. శ్రీదేవి మరణం టైం లో ఆమె చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయింది . "శ్రీదేవి కాల్ చేసినప్పుడు నేను షూటింగ్ పనుల్లో ఎత్తలేకపోయానని అదే తన చివరి కాల్ అవుతుందని ఊహించలేకపోయాను " అంటూ ఎమోషనల్ అయింది . ఓ ఇంటర్వ్యూలో సజల్ అలీ మాట్లాడుతూ శ్రీదేవి చివరిసారిగా తాను మిస్ చేసిన సందేశాన్ని వివరించారు . "దుబాయ్ లో స్ మసాలా అవార్డ్స్ కి వెళ్ళలేకపోయాను అని ఆ సమయంలో శ్రీదేవి - సజల్ కి ఐ మిస్ యు బేటా అని మెసేజ్ కూడా పంపారు అని చెప్పుకొచ్చారు". ఇదే విషయాన్ని మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!