
ఎంటీఎస్ విభాగంలో సైతం 4000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షను తెలుగులో కూడా రాసే అవకాశం ఉంది. హవాల్దార్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెండూ లెవెల్1 ఉద్యోగాలే కాగా వీళ్లకు బేసిక్ శాలరీ 18,000 రూపాయలుగా ఉంటుంది. డీఏ, హెచ్.ఆర్.ఏ కలిపి 35,000 రూపాయల వరకు వేతనం అందుకునే అవకాశం ఉంటుంది. శాఖాపరమైన పరీక్షలు రాసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలలో పని చేయవచ్చు. హవాల్దార్ గా ఎంపికైన వాళ్ళు కేంద్ర రెవిన్యూ, ఆర్ధిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పని చేయాల్సి ఉంటుంది. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్ బ్యూరోలో వీళ్ళు సేవలు అందించడం జరుగుతుంది. ఇందులో 2 సెషన్లు ఉంటాయి. 270 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
ఒక్కో సెషన్ వ్యవధి 45 నిమిషాలుగా ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు పరీక్షలు జరగనున్నాయి. ssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.