ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని నిన్నటి రోజున పోలీసులు సైతం పట్టుకున్నారు. సినిమా థియేటర్లలో గుట్టు చప్పుడు కాకుండా పైరసీ రికార్డు చేస్తున్న వ్యక్తిని సైతం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతడు ఏదాడి కాలంగా  సుమారుగా 50 సినిమాలకు పైగా రికార్డు చేసినట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు తెలిపారు. కొత్త సినిమా ఏదైనా వెంటనే రిలీజ్ అయ్యిందంటే చాలు దర్శక నిర్మాతలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఈ సినిమాలను పైరసీ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యక్తి సుమారుగా సినీ ఇండస్ట్రీకి 3700 కోట్ల రూపాయలు నష్టం కలిగించేలా చేసినట్లు పోలీసులు గుర్తించారట.


ముఖ్యంగా తన మొబైల్ లోనే సినిమాలను రికార్డు చేసి మరి వాటిని మూవీ రూల్స్, తమిళ ఎంపీ సైట్లకు సైతం అమ్ముతూ ఉండేవారట. ఒక్కొక్క చిత్రానికి 40000 నుంచి 80 వేల రూపాయల వరకు అమ్ముతున్నట్లు అధికారులు తెలియజేశారు. కొన్ని సినిమాలకు నెగిటివ్ టాక్, ట్రోల్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో పైరసీ భూతం అనేది నిర్మాతలకు మరింత నష్టాన్ని కలిగించింది. దీన్ని కట్టడి చేసేందుకు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎవరు ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు.


ఏళ్ల తరబడి కూడా ఈ పైరసీభూతాన్ని అరికట్ట లేకపోయారు. ఎంతో పెద్ద నెట్వర్క్ ఉందని ఇప్పటికే చాలామంది నిర్మాతలు కూడా తెలిపారు. తాజాగా పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని మాత్రం పోలీసులు పట్టుకోవడంతో చాలామంది దర్శక నిర్మాతలు కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నారు. కిరణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ నడి ఒడ్డులోనే ఒక మాల్ లో ఉన్న థియేటర్ నుంచే ఈ సినిమాలకు సంబంధించి రికార్డు చేస్తూ ఉండేవారట. చివరిగా కన్నప్ప వంటి చిత్రాలను సైతం పైరసీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. మరి ఈ వ్యక్తిని ఏం చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: