
ఈయనతో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. ఇప్పటికే ప్రభాస్ తో సలార్ చేశాడు రూ. 600 కోట్ల రాబట్టాడు . ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో ఉండగానే తర్వాత ప్రాజెక్ట్స్ ను అప్పుడే లైన్ లో పెట్టేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ .. ప్రస్తుతం నీల్ లిస్ట్ భారీగానే ఉంది . ఎన్టీఆర్ సినిమా తర్వాత ప్రశాంత్ లిస్టు లో స్టార్ హీరోస్ ఉన్నారు .. ఇప్పటికే కేజిఎఫ్ 3 అనౌన్స్ చేసిన ఇది ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు . అలాగే సలార్ 2 కూడా లైన్లో ఉంది .. అటు ప్రభాస్ ఇటు నీల్ వేర్వేరు సినిమాల తో బిజీగా ఉండటంతో సలార్ 2 కూడా ఇప్పట్లో మొదలవడం కష్టమే ..
ఇక మరి ఈ గ్యాప్లో అల్లు అర్జున్ వచ్చి చేరాడు .. అన్నీ కుదిరితే అట్లి తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ప్రశాంత్ నీతోనే కానుంది . 2026 జూన్ 25న డ్రాగన్ రిలీజ్ కానుంది .. అప్పటికి అట్లీ , అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పూర్తికానుంది .. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీ మొదలవుతుందని అంటున్నారు .. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు రావణం అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేయబోతున్నారు . మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో మూవీ రానుందని అంటున్నారు .. రామ్ చరణ్ , మహేష్ బాబు తోనూ ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయని ప్రచారం కూడా బయటకు వచ్చింది .