- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక మనం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు .. అలాగే మన పెద్ద హీరోల మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయంటే ఆ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తారు .  దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. అయితే ఇప్పుడు ఇలాంటి ఓ క్రేజీ మల్టీస్టారర్ గురించి టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది ..  గాడ్ ఆఫ్ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ త్వరలో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ..



అలాగే ఇదే విషయాన్ని వెంకటేష్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో ప్రకటించారు .. అలాగే తాను చేయబోయే సినిమాల జాబితా అని కూడా వెంకీ అక్క‌డే ప్రకటించాడు .. త్రివిక్రమ్ తో ఓ సినిమా చిరు , అనిల్ మూవీలో స్పెషల్ రోల్ .. మీనా తో కలిసి దృశ్యం 3 , అలాగే అనిల్ రావిపూడి తో మరో సినిమా .. ఆ తర్వాత బాల‌య్య తో  ఓ మల్టీ స్టార‌ర్ సినిమా ఉండబోతుంద ని ప్రకటించేసాడు వెంకీ మామ .. ఇక దీంతో వెంకటేష్ అభిమానుల తో పాటు నందమూరి అభిమానుల్లో కూడా ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ పై ఎక్కడలేని ఆసక్తి నెలకొంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది .



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: