సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా మరో స్టార్ హీరో చేతిలోకి వెళ్లిపోవడం కొత్త విషయం కాదు. ఇది చాలా కాలం నుండి జరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ మార్పులు మంచివి అవుతాయి, సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ మార్పులు ఇబ్బందులు తెస్తాయి, సినిమాకి నష్టం కలిగిస్తాయి. అయితే ఈ ట్రయాంగిల్ సినిమాల మార్పుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్యలో చర్చ జరుగుతుంది.  అల్లు అర్జున్ చేయాల్సిన ఒక సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కి దక్కిందట. అదేవిధంగా, జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఒక సినిమా రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్లిందని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ మార్పులన్నీ ఒక సైకిల్‌లా జరుగుతున్నాయంటూ అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.


అందరికీ తెలిసిన విషయమే.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇద్దరూ బావా-బావా అని పిలుచుకుంటూ, వ్యక్తిగతంగా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. కానీ సినిమాల విషయంలో మాత్రం ఒక హెల్దీ కాంపీటీషన్ తప్పదు. ఎవరు ఏ సినిమా చేస్తారు, ఆ సినిమా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న దానిపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి. దీనిలో భాగంగానే – కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా చివరికి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పడింది. అదే ఇప్పుడు "దేవర".

 

మొదట్లో ఈ ప్రాజెక్ట్‌కి అల్లు అర్జున్ కమిట్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. ఆ తరువాత చాల కాలం డిలే అయింది. దాంతో దర్శకుడు కొరటాల శివ కొన్ని మార్పులు చేసి, ఎన్టీఆర్‌తో ఆ సినిమాను మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కి ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు కూడా ఈ సినిమాకి రెస్పాన్స్ వేరే లెవెల్‌లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. ఇక మరోవైపు, బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో వస్తున్న "పెద్ది" సినిమాకి మొదట జూనియర్ ఎన్టీఆర్‌నే ఆలోచించారు. బుచ్చిబాబు ఆయన కోసం చాలా కాలం వేచి చూశారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ ఛాన్స్ రామ్ చరణ్‌కి దక్కింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.



ఇప్పటికే మేకర్స్ అందిస్తున్న అప్‌డేట్స్ చూస్తే "పెద్ది" వేరే లెవెల్‌లో ఉండబోతుందని క్లియర్‌గా తెలుస్తోంది. అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. “ఈ సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుంది” అని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. అయితే నిజంగా హిట్ అవుతుందా లేదా అనేది రాబోయే కాలంలోనే తేలుతుంది. మొత్తానికి, అల్లు అర్జున్‌కి దక్కాల్సిన సినిమా ఎన్టీఆర్‌కి, ఎన్టీఆర్‌కి దక్కాల్సిన సినిమా రామ్ చరణ్‌కి వెళ్ళిన ఈ “ట్రయాంగిల్ సినిమా మార్పు సైకిల్” ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హంగామా క్రియేట్ చేస్తోంది. అభిమానుల మధ్యలో హాట్ టాపిక్‌గా ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: