• - సాయిబాబా భక్తురాలు కావడంతో పేరులో ‘సాయి’
  • - చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం
  • - తెలంగాణ యాస భాషతో సాయిపల్లవికి పెరిగిన ఫ్యాన్స్


‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. తెలంగాణ యాసలో సాయి పల్లవి చెప్పే డైలాగులకు ఆమె ఫ్యాన్స్ అంతా పడి చస్తుంటారు. సాయిపల్లివి మరో సినిమాలో తెలంగాణ యాసలో  మరోసారి అదరగొట్టనుంది. ‘ఫిదా’ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఆ సినిమాలో భానుమతిగా సాయి పల్లవి అద్భుతమైన నటనను కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది. అందుకే తన తరువాత సినిమాలోనూ సాయి పల్లవినే హీరోయిన్‌గా తీసుకున్నారు శేఖర్ కమ్ముల. అక్కినేని నాగచైతన్యతో శేఖర్ కమ్ముల సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

 

సాయిపల్లివి నేపథ్యం:

సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గరలోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది. ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొంది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.

 

వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది. ఇప్పుడు మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ యాసలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: