టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు విలన్ క్యారెక్టర్ల పై మోజు పడుతున్నారు.  నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.  స్టార్ హీరోల నుంచి మొదలుకొని కుర్ర హీరోల వరకు అందరూ విలనిజాన్ని పండించడానికి రెడీ అంటున్నారు .


  ఇప్పటివరకు పక్కింటి కుర్రాడి పాత్రల్లో  కనిపించిన మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్,  హరీష్ శంకర్ రూపొందిస్తున్న వాల్మీకి సినిమాలో గద్దల కొండ గణేష్ గా తన  విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు . ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమా లో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా నటించాడు.  కార్తికేయ ఈ చిత్రంలో విలన్ గా నటించడం ఆ సినిమాకి ప్లస్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు .


 ఇక తెలుగు , తమిళ సినిమాల్లో హీరోగా నటిస్తున్న  ఆది పినిశెట్టి ని,  విలన్ గా మార్చేశాడు దర్శకుడు బోయపాటి . బోయపాటి విలన్ గా మార్చితే ,  త్రివిక్రమ్ అదే కంటిన్యూ చేసి ఆది పినిశెట్టి మార్కెట్ ను అమాంతం  పెంచాడు . ఇక చిన్న చిత్రాల హీరో నవీన్ చంద్ర కూడా ఇటీవల విలన్ క్యారెక్టర్లతో అందరిని మెప్పిస్తున్నాడు .


  హీరోగా ఒక వెలుగు వెలిగి , ఆ తరువాత సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఫ్యామిలీ హీరో జగపతిబాబు , విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన తరువాత అదే స్ఫూర్తి తో పలువురు విలన్ క్యారెక్టర్లు చేయడానికి రెడీ అంటున్నారు. ఇక  స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం జై లవ కుశ చిత్రం లో  నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించిన విషయం తెల్సిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: