మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ’సైరా’పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల క్రితమే అనుకున్న కథ అని అది తెరపైకి తీసుకు రావడానికి ఇంత కాలం పట్టిందని ఈ మూవీ నిర్మాత కొణిదెల రాంచరణ్ పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే. 

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతన్న నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ప్రపంచ వ్యాప్తంగా వెలుగు లోకి తీసుకు రావడానికి ఇదే సరైన సమయం అనుకొని ఈ సినిమా తీసినట్లు రాంచరణ్ తెలిపారు.  ఇక ఈ మూవీ కోసం మెగాస్టార్ పడ్డ కష్టం ‘సైరా’ రిలీజ్ తర్వాత తెలుస్తుందని అన్నారు.  శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఇక ట్రైలర్ బిగినింగ్ చూస్తుంటేనే రోమాలు నిక్కబోడుస్తున్నాయి. నరసింహారెడ్డి సామాన్యుడు కాదు..అతనో కారణ జన్ముడు, అతనొక యోగి..అతనొక యోధుడు అతన్నెవ్వరూ ఆపలేరు అంటూ సాగుతుంది.

‘ ఈ భూమ్మీద పుట్టింది మేము..ఈ మట్టిలో కలిసేది మేము..నీకెందుకు కట్టాలిరా శిస్తు..అంటూ మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్ చూస్తుంటే..ఒళ్లు గగుర్బొడుస్తుంది. ‘స్వతంత్రం కోసం జరుగుతున్న తొలి యుద్దమిది..ఈ యుద్దంలో నువు గెలవాలి..అంటూ అమితాబ్ డైలాగ్.. నీ గెలుపు కళ్లారా చూడాలని వచ్చాను..సైరా నరసింహారెడ్డి అంటూ సుదీప్ డైలాగ్.. వీరత్వానికి పేరుబడ్డ తమిళ్ భూమి నుంచి వచ్చా..రాముడికి లక్ష్మణుడి మాదిరి నీకూడా ఉంటాను..అంటూ సేతుపతి డైలాగ్స్ చూస్తుంటే..అలనాటి స్వాతంత్ర పోరాటం ఎంత వీరోచితంగా సాగిందో కళ్లకు కట్టినట్టు చూపించారు.

ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఆడియన్స్ రక్తం ఉప్పొంగినట్లు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక థియేటర్లో ఏ రేంజ్ లో దుమ్మురేపబోతుందో అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: