ఆయన వయసు ఎనభయ్యేళ్ళు. 38 ఏళ్ళకే మాహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రం, సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర  ఆయనది. మరాఠాయోధుడిగా శరద్ పవార్ యాభయేళ్ళకు పైగా వెలుగొందారు. పవార్ అనేక సార్లు ముఖ్యమంత్రిగా, అలాగే  కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు.

 

అయితే  కొన్నేళ్ళుగా పవార్ పవర్ మహా రాజకీయాల్లో పనిచేయడంలేదు. ఆయన ఎన్సీపీ పార్టీలో వారసత్వ  పోరు  పరాకాష్టకు చేరింది. ఓ వైపు కూతురు సుప్రియ సూలే ఉంది. ఆమెకే తన రాజకీయ వారసత్వం అప్పగించాలని పవార్ ఆలోచన. అయితే అన్న కొడుకు అజిత్ పవార్ కూడా పోటీగా  ఉన్నారు. ఆయన తన కుమారుడు  పార్ధు పవార్ ని కూడా మూడవ తరంగా రాజకీయల్లోకి తీసుకువస్తున్నాడు.

 

అయితే ఎన్ని చేసినా కూడా బాబాయ్ వారసత్వం చెల్లెలు సుప్రియా సూలేకే  వెళ్తుందన్నది అజిత్ పవార్ కి తెలియనిది కాదు. అందుకే అచ్చం బాబాయి బాటలోనే అంటే 1978లో శరద్ పవార్  ముఖ్యమంత్రి పదవి కోసం ఉన్న పార్టీని ఎలా చీల్చాడో అలాగే ఎమ్మెల్యేలను చీల్చి  ఉప ముఖ్యమంత్రి అయిపొయారు. ఇకపైన సొంత రాజకీయం చేసుకుంటే ఎప్పటికైనా మహా రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలన్నది అజిత్ పవార్ ఆశయం. అదే శరద్  పవార్ నీడన ఉంటే అసలు కుదరదు, దాంతో బీజేపీ కూడా బాగా దువ్వింది. అంతే ఆయన వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా గోడ దూకేశారు.

 

ఈ రోజు రాయబారాలకు వచ్చిన వారిని కూడా కలవడానికి అజిత్ పవార్ ఇష్టపడలేదంటే ఆయన ఎంతగా శరద్ పవార్ పట్ల విసిగి ఉన్నారో అర్ధమవుతుంది మొత్తం మీద ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. రేపటి రోజున శివసేన కూడా చీలుతుంది. అపుడు ప్రతిపక్షంలో ఖాళీ అయిన చోట నుంచి తన కొత్త రాజకీయాన్ని ప్రారంభించాలని అజిత్ పవార్ ఆలోచనగా కనిపిస్తోంది.  మొత్తానికి అచ్చం బాబాయి నే అనుసరించి మరీ అజిత్ తన పొలిటికల్ కెరీర్ ని దిద్దుకుంటున్నాడని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: