
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత బులెటిన్‌లో వెయ్యిలోపు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు కాగా... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,536 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 1,421 మంది కరోనా నుంచి కోలుకోగా.. మరో ముగ్గురు మృతిచెందారు. కోవిడ్ మరణాల రేటు భారత్ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.55 శాతానికి పడిపోయింది.. ఇక, రికవరీ రేటు దేశంలో 91.7 శాతంగా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో 92.12 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,42,506కి చేరింది. ఇప్పటి వరకు 2,23,413 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,351కు చేరింది.
ప్రస్తుతం తెలంగాణలో 17,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 45,021 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 43,94,330 కు చేరింది. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 281, జయశంకర్ భూపాలపల్లి 19, జోగులమ్మ గద్వాల్ 8, కామారెడ్డి 38, ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 123, జగిత్యాల్ 37, జనగాం 18, కరీంనగర్ 76, ఖమ్మం 97, కొమరం భీమ్ అసిఫాబాద్ 7, మహబూబ్ నగర్ 22, మహబూబాబాద్ 24, మంచిర్యాల్ 37, నిర్మల్ 22, నిజామాబాద్ 32, పెద్దంపల్లి 31, రాజన్న సిరిసిల్ల 33, రంగారెడ్డి 92, మెదక్ 21, మేడ్చల్ మల్కాజ్‌గిరి 96, ములుగు 26, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 81, నారాయణ్‌పేట్ 8, సంగారెడ్డి 21, సిద్ధిపేట్ 30, సూర్యాపేట 47, వికారాబాద్ 22, వనపర్తి 32, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ 49, యాద్రాది భువనగిరి 31 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ మొదలైనట్లేనని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గడిచిన పదిరోజుల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఇక కేరళలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య తగ్గడంలేదు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,138 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంట వ్యవధిలో కొత్తగా 7,198 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా గత 24 గంటల్లో 21 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.