దేశంలో ది బెస్ట్ పీఎం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రధాని మోడీ పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తుంది. దేశంలో  ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి దేశంలో పెద్ద హీరో అయిపోయిన మోడీ ఇప్పుడు జీరో గా మారిపోయాడు. రైతు ల ఉద్యమం తో మోడీ పై ఒక్కసారిగా ప్రెషర్ రావడంతో పాటు రైతుల్లో ఉన్న పేరును కూడా చెడగొట్టుకున్నంత పనయ్యింది. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి విలన్ గా కనిపిస్తున్నారు.. ముఖ్యంగా రైతుల పాలిట దెయ్యంగా మోడీ ని అభివర్ణిస్తున్నారు..  

పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టం వల్ల దేశంలో ని రైతుల ఆగ్రహానికి గురయ్యారు మోడీ.. ఈ చట్టాన్ని తెచ్చినప్పుడు చాలా పార్టీ వద్దని వాదించాయి.. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ సైతం ఈ బిల్లు కు వ్యతిరేకంగా వాక్ అవుట్ చేశారు. దాంతో ఆదిలోనే మోడీకి హంసపాదు ఎదురైంది. అప్పటివరకు హీరో గా ఉన్న మోడీ లో షాడో నీడలు మొదలయ్యాయి..  సొంత పార్టీ నేతలకు మోడీ తన అసలు స్వరూపం చూపెట్టడం మొదలుపెట్టారు.. మోడీ ఏం తలచి ఈ బిల్లు ను ప్రవేశపెట్టారో కానీ ఆయనకు గతంలో ఎప్పుడు లేని వ్యతిరేకత మొదలైంది.. ఢిల్లీ లో వేలాది మంది రైతులు ఇప్పుడు చట్టాన్ని రద్దు  చేయాలనీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే..

. గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయక రోజూ వందల మంది వచ్చి ఉద్యమంలో చేరుతున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఢిల్లీ శివార్లలో టెంట్లు వేసుకుని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతు ఉద్యమానికి రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు కూడా రోజురోజుకూ పెరుగుతోంది.  ఈనేపథ్యంలో డిచిన 25 రోజులుగా నిరస హోరు కొనసాగిస్తున్న రైతులకు కేంద్రం మరోసారి వర్తమానం పంపింది. చర్చలకు వెళ్లాలా..? వద్దా..? అని రైతులు నిర్ణయం తీసుకోనున్నారు.డిసెంబరు 9వ తేదీన తాము సూచించిన సవరణలపై అభ్యంతరాలతో పాటు రైతులు ఏఏ అంశాల్లో ఆందోళన చెందుతున్నారో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలకు ఎపుడు వచ్చేదీ తేదీ చెప్పమని కోరుతూ వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఓ లేఖ పంపారు. ఆదివారం రాత్రే ఇది వచ్చినా రైతులు దీనిని వెంటనే పట్టించుకోలేదు. ఇందులో కొత్త విషయమేమీ లేదని, అయినప్పటికీ 40 యూనియన్ల నాయకులూ సమావేశమై దీనిని చర్చిస్తారని, భవిష్యత్‌ కార్యాచరణను కూడా నిర్ణయిస్తారని క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు గుర్మీత్‌ సింగ్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: