ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ నేతలు మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి ఏకగ్రీవాలు చేసుకునే విధంగా అడుగులు వేయాలని ఆయన ఎన్నో ఆదేశాలు ఇచ్చారు. ఎన్నో సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వస్తున్నారు.

అయితే అనుకున్న విధంగా మాత్రం పరిస్థితి కనబడడం లేదనే వార్తలు వినపడుతున్నాయి. ఏకగ్రీవాల విషయంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతున్నది. అయితే ఇప్పుడు ఈ ఏకగ్రీవాలు విషయంలోనే వైసీపీ నేతలు కాస్త ఇబ్బందులు పెడుతున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సొంత జిల్లా కర్నూలు రుద్రవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవం అయింది. దీనిపై ఇప్పుడు వైసిపి వర్గాలు చాలా ఆగ్రహంగా ఉన్నాయి.

 అక్కడ వైసీపీ ఏకగ్రీవం చేసుకోవాల్సి ఉన్నాసరే గోరంట్ల మాధవ్... ప్రత్యర్ధి అభ్యర్ధి తన బంధువు కాబట్టి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వినపడుతున్నాయి. గోరంట్ల మాధవ్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి. అయితే ఈ విషయంలో తన తప్పేమీ లేదని గోరంట్ల మాధవ్ పలు సందర్భాల్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. అక్కడ తాను ఉండటం లేదని తాను ప్రస్తుతానికి ఎంపీగా హిందూపురానికి మాత్రమే పరిమితమై తన సొంత జిల్లాకు అసలు వెళ్లడం లేదని ఆయన కొంత మంది వద్ద చెబుతున్నారు. అయితే ఈ అంశం గురించి వైసీపీ అధిష్టానం కూడా ఆరా తీసినట్లు గా తెలుస్తుంది. పోలీస్ అధికారిని ఎంపీని చేస్తే ఇలా చేస్తారా అంటూ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: