త‌ప్పు చేశాం
త‌ప్పు ఒప్పుకుంటున్నాం
రాజ‌ధాని రైతుకు నా క్ష‌మాప‌ణ‌లు
కాసేప‌ట్లో జ‌గ‌న్ ఈ విధంగానే
మాట్లాడ‌నున్నారు ఇది ఫిక్స్
అరే సాంబా ! రాస్కో రా రాస్కో!

ముందునుంచి అనుకున్న విధంగా రాజ‌ధాని క‌థ లేదు. ముందు నుంచి అనుకోనివిధంగా ఈ క‌థ న‌డుస్తోందిక. అవును! జ‌గ‌న్ తీసుకుని తీరాల‌నుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల వెనుక ఉన్న‌దెవ‌రు? ఒక‌వేళ సీన్ లోకి బీజేపీ వ‌చ్చి పాత లెక్క‌లు తేల్చి అప్పుడు కొత్త రాజ‌ధాని క‌ట్టుకోండ‌ని చెప్పిందా? లేదా పురంధ‌రి లాంటి బీజేపీ లీడ‌ర్ల ఎంట్రీ అన్న‌ది జ‌గ‌న్ కు న‌చ్చ‌లేదు క‌నుక‌నే ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకోనున్నారా? ఏ విధంగా చూసినా రాజ‌ధాని పేరుతో రాజ‌కీయం చేస్తే గెలిచేది టీడీపీనే, కాస్తో కూస్తో బీజేపీ కూడా.. వీరితో పాటు జ‌న‌సేన‌ను కూడా జ‌గ‌న్ సేన ఢీకొనాల్సి ఉంటుంది. కాస్తో కూస్తో వామ‌ప‌క్షాల‌ను స‌జ్జ‌ల లాంటి పెద్ద‌లు ప్ర‌స‌న్నం చేసుకుంటున్న తరుణాన జ‌గ‌న్ స‌డెన్ గా రూటు మార్చేశారు. రూలు మార్చేశారు. ఒక‌వేళ  మా రాజ‌ధాని అమ‌రావ‌తే అని తేల్చేస్తే బొత్స లాంటి మంత్రులు ఏమ‌యిపోతారో? అన్న చ‌ర్చ ఒక‌టి టీడీపీ నుంచి విన‌వ‌స్తోంది. "ఎందుకంటే రాష్ట్ర రాజ‌ధాని గురించి ధ‌ర్మాన క‌న్నా ఎక్కువ మాట్లాడింది బొత్స‌నే. ఉత్త‌రాంధ్ర‌లో ప‌ట్టుకోసం ప‌రువు కోసం ధ‌ర్మాన లాంటి నేత‌లు కొన్ని స‌మావేశాలు నిర్వ‌హించి జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్దతుగా మాట్లాడారు. కానీ ఆయ‌న క‌న్నా ఎక్కువ‌గా మాట్లాడి ఓ విధంగా అమ‌రావతిని రాజ‌ధానిగా ఉంచ‌డాన్ని ఎక్కువ‌గా హేళ‌న చేసింది బొత్స‌నే! మ‌రి! ఇప్పుడు వీళ్లంతా ఏమైపోతారో? అదే ఇప్పుడు చ‌ర్చ‌కు కార‌ణం. అదే ఇప్పుడు ఎటెన్ష‌న్ పాయింట్ కూడా!" అన్న‌ది టీడీపీ త‌ర‌ఫు వాద‌న‌గా ఉంది కూడా!
 

ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో
 
మోడీ బాట‌లోనే జ‌గ‌న్ పోనున్నారు. న‌ల్ల చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసి మోడీ ఎలా అయితే సేద్య‌గాడి మ‌న‌సు దోచుకునేందుకు ప్ర‌య‌త్నించారో అదే విధంగా జ‌గ‌న్ కూడా అదే వ‌రుస‌లో పోనున్నారు. ఇవాళ రాజ‌ధానికి సంబంధించి ఏదో ఒక క్లారిటీ ఇవ్వ‌నున్నారు. మూడు రాజ‌ధానులు వ‌ద్దు ఒక రాజ‌ధానే ముద్దు అని కూడా చెప్ప‌నున్నారు. అదే అయ్యేందుకు ఛాన్స్ ఉంటే ఇక ప‌రిణామాలు అన్నీ అమ‌రావ‌తి చుట్టూనే తిర‌గనున్నాయి. దీంతో ఇంత‌కాలం రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ పేరిట చేస్తున్న ఉద్య‌మాలు అన్నీ ఫ‌లించ‌నున్నాయి. త‌ద్వారా రాజ‌ధాని రైతులు గెలుపు సాధించేందుకు అవ‌కాశాలు సులువు అయి, సంబంధిత దారులు అన్నీ  సుగమం అయ్యాయి. అయితే ఇప్ప‌టికే  న్యాయ స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ పేరిట పాదయాత్ర చేస్తున్న రైతుల‌కు ఇప్పుడు వైసీపీ సంఘీభావం తెల‌ప‌డం ఖాయం. అంతేకాదు వారితో ద‌గ్గ‌రుండి పాద‌యాత్ర‌ను విరమింప‌జేయ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఈ క్ష‌ణానికి ఏమౌతుందో అన్న‌ది ఉత్కంఠ క్యాబినెట్ భేటీ అయ్యేంత వ‌ర‌కూ సాగేలా ఉంది. ఒక‌వేళ రాజ‌ధాని రైతుకు అనుగుణంగానో, అనుకూలంగానో జ‌గ‌న్ నిర్ణ‌యం ఇస్తే టీడీపీ రాష్ట్రంలో ఇక ఉనికి కోల్పోనుంద‌ని తేలిపోనుంది. ఈ త‌రుణాన రాజ‌ధాని రైతుకు మ‌ద్ద‌తిస్తూ జ‌గ‌న్ వారితో మాట్లాడ‌డ‌మే కాదు వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పే అవ‌కాశం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: