మ‌రొక్క సారి లాక్డౌన్ అయితే ఏమౌతుంది. ఇదే టాపిక్ నుంచి డీవియేట్ కాకుండా ఆలోచిస్తే చాలా విష‌యాలు అర్థం అవుతాయి. ఇప్ప‌టికే కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం అంటూ విపరీతం అయిన ఒత్తిడి పెంచి ఉద్యోగుల‌తో గొడ్డు చాకిరీ చేయిస్తున్నాయి. ఎనిమిది గం ట‌ల ప‌ని కాస్త ఎప్పుడో ఉద్యోగుల స‌మ్మ‌తి లేకుండానే పెరిగిపోయింది. అదేవిధంగా జీతం పెంపుద‌ల అన్న‌ది క‌రోనా సాకుతోనే ఆ గిపోయింది కూడా! చాలా కంపెనీలు ఉద్యోగుల‌ను న‌ష్టాల పేరిట తొలగించాయి కూడా! వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే మ‌ళ్లీ లాక్డౌన్ రాకూడ‌ద‌నే కోరుకోవాలి ప్ర‌తి ఒక్క‌రూ! ఇప్ప‌టికే ఉత్ప‌త్తి రంగం పూర్తిగా కుదేల‌యిపోయింది. కంపెనీలు చాలా మూత‌ప డ్డాయి. ఇవన్నీ కాకుండా ధ‌ర‌లు కూడా లాక్డౌన్ కార‌ణంగానే  పెరిగిపోతున్నాయి. ఇలా ఒక్క‌టేంటి అనేక న‌ష్టాలు లాక్డౌన్ వ‌ల‌నే జ‌రి గాయి. జ‌ర‌గ‌బోతున్నాయి కూడా! ఈ సంద‌ర్భంలో ఉద్యోగుల భ‌యాలు రెట్టింపు అయ్యేలా మ‌రో సారి లాక్డౌన్ వ‌స్తే చాలా వ‌ర‌కూ ఈ సంక్షోభ నివార‌ణ సాధ్యం కాక‌పోవ‌చ్చు. ప్ర‌భుత్వాలు కూడా పూర్తిగా చేతులెత్తేస్తున్నాయి క‌నుక ఇక ఎవ‌రికి వారు స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చి క‌రోనా గండం నుంచి గ‌ట్టెక్కాల్సిందే!


ఇక లాక్డౌన్ కార‌ణంగా విద్యా సంస్థ‌లు అన్నీ భారీగా న‌ష్ట‌పోయాయి. విద్యార్థులంతా ఇళ్లకే ప‌రిమితం అయ్యారు. చాలీచాల‌ని వేత‌నాల‌తో నెట్టుకువ‌స్తున్న ప్ర‌యివేటు టీచ‌ర్ల‌కు లాక్డౌన్ అన్న‌ది మ‌రో శాపంగా మారింది. దీంతో కుటుంబాల‌ను పోషించుకోలేక చాలా మంది రోడ్డున పడ్డారు. కొంద‌ర‌యితే కూర‌గాయ‌లు అమ్మారు. ఇంకొంద‌రు వేర్వేరు ప‌నులు చేసుకుంటూ కుటుంబాల‌ను నెట్టుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు ఇప్ప‌టికీ పిల్ల‌ల చ‌దువులు ఏవీ గాడిన ప‌డలేదు. ఆన్లైన్ చ‌దువులు అర్థం కాక,క్లాస్ రూం లో పాఠాలు విన్నంత సౌల‌భ్య‌త ఇంట్లో లేక చాలా మంది విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న చెందారు కూడా! కొన్ని చోట్ల స్మార్ట్  ఫోన్ సౌక‌ర్యం లేని వారు అయితే అస‌లు పాఠాలే విన‌లేక చ‌దువుల్లో ఎంత‌గానో వెనుక‌బ‌డిపోయారు. ఇలాంటి సంక్షోభాల నుంచి ఎలా నెట్టుకు రావాలో లేదా నెగ్గుకు రావాలో తెలియ‌క చాలా మంది గ్రామీణ విద్యార్థులు బ‌డుల‌కు మ‌రింత‌గా దూరం అయిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఆ విధంగా డ్రాపౌట్లు పెరిగారు కూడా!



లాక్డౌన్ నెపంతో కొన్ని, లాక్డౌన్ కార‌ణంగా కొన్ని విద్యా సంస్థ‌లు పూర్తిగా త‌మ మ‌నుగడ‌నే కోల్పోయాయి. లాక్డౌన్ కార‌ణంగా కార్పొరేట్ సంస్థలు కూడా త‌మ ఉద్యోగుల‌కు స‌గం జీతం చెల్లించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. అంతేకాదు కొన్నింట ఉద్యోగుల‌ను చెప్పాపెట్ట‌కుండా తొలగించి, వారికి  చుక్కుల చూపించిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి.  లాక్డౌన్ నెపంతో చాలా వ‌స్తువుల ధ‌ర‌లు మార్కెట్లో పెరిగిపోయినా ప్ర‌భుత్వాలు మాత్రం వాటిని  ప‌ట్టించుకున్న దాఖ‌లాలు కూడా లేవు. మొద‌టి లాక్డౌన్ లో ధ‌ర‌ల నియంత్ర‌ణపై ఆ పాటి శ్ర‌ద్ధ ఉన్నా రెండో లాక్డౌన్ లో అది కూడా లేకుండా పోయింది. ఈ విధంగా అటు ఉద్యోగులు ఇటు ఉపాధ్యాయులు చివ‌ర‌గా విద్యార్థులు అంతా ఎంత‌గానో న‌ష్ట‌పోయారు. అయినా ఏదో ఒక‌విధంగా కోలుకుంటున్న ప్ర‌జ‌ల‌కు ఇప్పుడో వింత స‌మ‌స్య ఈ ఒమిక్రాన్ వేరియంట్. దీనిని కూడా జ‌యించేందుకు అవ‌కాశాలున్నాయి.. అందుకు త‌గ్గ మార్గాలూ ఉన్నాయి. ఆందోళ‌న చెందితే ఫ‌లితాలు రావు. కనుక   దేన్న‌యినా ధైర్యంతోనే జ‌యించాలి. భ‌యంతో కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: