ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో భయపడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రం కూడా కనపడటం లేదు అనే మాట వాస్తవం. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి కాస్తో కూస్తో బలపడే అవకాశాలు ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ మాత్రం ఏ మాత్రం కూడా లేవు అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయంగా చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గా కనపడుతుంది అనే వ్యాఖ్యలు బద్వేల్ ఎన్నికల తర్వాత వినపడుతున్నాయి. ఇక పార్టీ విషయంలో పార్టీ అగ్రనేతలు కూడా ఈ మధ్య కాలంలో కాస్త బీజేపీ నుంచే గట్టి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి సంబంధించి బీజేపీ అగ్ర నేత కేంద్ర మంత్రి అమిత్ షా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం కూడా ఈ మధ్య కాలంలో కాస్త సంచలనంగా మారిన విషయంగా చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆలోచన మరో రకంగా ఉందని భారతీయ జనతా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు అలాగే కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీని ముందుకు నడిపించేందుకు అమిత్ షా అని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఒకవేళ కలిసి ముందుకు వెళితే మాత్రం కచ్చితంగా ఎన్ని స్థానాల్లో పొత్తు పెట్టుకోవాలని ఏంటి దానికి సంబంధించి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఈ నేపథ్యంలోనే రాయలసీమలో ఎక్కువ స్థానాలు కోరే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొన్ని కొన్ని అంశాల్లో కాస్త సీరియస్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి అనే కామెంట్స్ వినబడుతున్నాయి.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: