తెలంగాణలో బలపడాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకాలం తెలంగాణలో బీజేపీకి అవకాశం దొరకలేదు. ఆ పార్టీ ఎప్పుడన్నా టీడీపీతో పొత్తుతో పోటీ చేసి నాలుగైదు సీట్లు తెచ్చుకునేది గానీ..సొంతంగా సత్తా చాటడం పెద్దగా ఎప్పుడు చూడలేదు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి పరిస్తితి మారింది. అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. టీఆర్ఎస్ వల్లే బీజేపీకి అవకాశం దొరికిందని చెప్పొచ్చు.

ఇతర ప్రతిపక్ష పార్టీలని కేసీఆర్ చాలావరకు తోక్కేశారు. దీంతో బీజేపీకి అనూహ్యంగా ఛాన్స్ దొరికింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి ప్లస్ అయింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో మరింత బలపడటానికి అవకాశం దొరికింది. అదే సమయంలో బలమైన నాయకులని చేర్చుకుని బీజేపీ దూకుడు వెళ్ళడం మొదలుపెట్టింది. ఉపఎన్నికల్లో గెలవడం కూడా బాగా ప్లస్ అయింది.

ఇదే క్రమంలో బీజేపీలోకి తీన్మార్ మల్లన్నని చేర్చుకున్నారు. మల్లన్నకు తెలంగాణలో కాస్త ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఇలా బలంగా ఉన్న మల్లన్నని బీజేపీలోకి తీసుకొచ్చారు. బీజేపీలోకి వచ్చాక మల్లన్న మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన, కేటీఆర్ కుమారుడుని కూడా రాజకీయాల్లోకి లాగారు. తాజాగా సోషల్ మీడియాలో అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా? అని మల్లన్న పోస్ట్ పెట్టారు.

ఇలా హిమాన్షు శరీర ఆకృతిపై కామెంట్ చేయడంపై మల్లన్నపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ దీనిపై సీరియస్ అయ్యారు. అలాగే పార్టీలకు అతీతంగా షర్మిల సైతం దీనిపై స్పందించారు. రాజకీయాల్లోకి పిల్లలని, మహిళలని లాగడం కరెక్ట్ కాదని అన్నారు. మల్లన్న ఇలా చేయడం వల్ల బీజేపీకే నష్టం జరిగేలా ఉంది. ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా...రాజకీయంగా ఏదైనా విమర్శలు చేస్తే బాగానే ఉండేది...కానీ ఆయన అలా చేసేసరికి అందరూ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: