తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి. ఇక్కడి పథకాలు చాలా వరకు దేశం మొత్తం ప్రాచుర్యం పొందాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో ప్రజలు కేసీఆర్ పెట్టె స్కీములు చాలా బాగున్నాయి అని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే  సీఎం కేసీఆర్ దేశ్ కి నేత గా ఎదగాలని దేశం మొత్తం అభివృద్ధి దిశలో నడిపించే ఆలోచన చేస్తున్నట్టు ఈ మధ్య చూసిన పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అయితే మోడీ అడ్డా అయిన వారణాసిలో  సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలతో చాలా హైప్ వస్తుందని చెప్పవచ్చు. మరి ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారో తెలుసుకుందామా..!

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. వారణాసిలో కేసీఆర్ ప్రచారానికి టీఆర్‌ఎస్ నేతలు భారీ హైప్ ఇస్తున్నారు. ఆలయ పట్టణానికి గులాబీ రంగు పూసి టీఆర్‌ఎస్‌కు చెందిన ఫ్లెక్స్‌ బోర్డులు ప్రతి మూలకు పార్టీ రంగులతో అలంకరించారు. ఉత్తరప్రదేశ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం" అని పోస్టర్లు మరియు బ్యానర్లు వారణాసి మొత్తం గులాబీ మయం చేశారు. వారణాసిలో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రచారం కోసం పట్టణానికి వచ్చిన కేసీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.


 యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా తెలంగాణ మ్యాప్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఫ్లెక్స్ బోర్డులపై ఉంచారు.  ఫ్లెక్స్ బోర్డులతో పాటు పలు చోట్ల కేసీఆర్ భారీ కటౌట్లు కూడా దర్శనమిచ్చాయి. కేసీఆర్‌తోపాటు ఆయన తనయుడు కేటీ రామారావు, మంత్రి వీ ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ తదితరులు, ఫ్లెక్స్‌ బోర్డులపై అక్కడి ప్రజలకు దర్శనమిస్తున్నారు. అయితే, మమతా బంజెర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, నవీన్ పట్నాయక్, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, శరద్ పవార్ వంటి ఇతర నాయకుల చిత్రాలు కూడా ఫ్లెక్స్ బోర్డులపై కనిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: