సినిమాల్లో విలన్లను వంటి చేత్తో మట్టి కరిపించే కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో గ్యాంగ్ స్టర్లకు భయపడతారా..? ఒకవేళ అదే నిజమైతే.. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఎక్కడ ఉన్నారు..? సెక్యూరిటీని పెంచుకున్నారా..? లేక పోలీసుల్ని ఆశ్రయించారా..?

ఇటీవల పంజాబ్ ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.. కొంతమంది దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. సిద్దూని దారుణంగా చంపేశారు. అయితే సింగర్ సిద్ధూని చంపేసినట్టే.. నిన్ను కూడా చంపేస్తామంటూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కు బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తోపాటు, ాయన తండ్రి సలీమ్ ఖాన్‌ ను కూడా హతం చేస్తామంటూ ఆ లేఖలో దుండగులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ లేఖ ఎవరు రాశారనే విషయంలో క్లారిటీ లేదు కానీ, సల్మాన్ మాత్రం ముందు జాగ్రత్తగా పోలీసుల్ని ఆశ్రయించారు.

సల్మాన్ ఖాన్‌ కు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్ ని చంపి తన పవరేంటో చూపిస్తానంటూ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో శపథం చేశాడు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకల వేట సమయంలో లారెన్స్ అలా వార్నింగ్ ఇచ్చాడు. బిష్ణోయ్ తెగవారు కృష్ణజింకలను ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటిని సల్మాన్ ఖాన్ వేటకు వెళ్లి చంపాడని ఆరోపణలు వచ్చినప్పుడు, బిష్ణోయ్ తెగకు సంబంధించిన కొందరు సల్మాన్‌ పై కోర్టులో కేసు కూడా వేశారు. అప్పట్లో రాలెన్స్ సల్మాన్ ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత కూడా లారెన్స్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో ఆయన గతంలో ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. అంతే కాదు, సల్మాన్ కి వచ్చిన బెదిరింపు లేఖ కూడా కలకలం సృష్టిస్తోంది.

సల్మాన్ మాత్రం ముందు జాగ్రత్తగా పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణతోపాటు.. సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని కూడా టైట్ చేశారు పోలీసులు. అనుమానితులపై నిఘా పెట్టారు. మరోవైపు పంజాబ్ లో మరికొందరు సింగర్స్ కి కూడా ప్రాణాపాయం ఉందనే వార్తలొస్తున్నాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం గతంలో వీఐపీలకు గన్ మెన్లను విత్ డ్రా చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: