వివేకానందరెడ్డి మర్డర్ వెనుక అసలు కారణాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పింది నిజమేనా ? నిజమో కాదు తెలీదు కానీ జనాల్లో నలుగుతున్నవి, లాజికల్ గా కాస్త దగ్గరగా ఉన్నాయని మాత్రం అనిపిస్తోంది. చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా చెబుతున్న కారణాలు ఏమిటంటే రాజకీయంగా తనకు అడ్డువస్తున్నారని, ఎంపీ సీటుకు పోటీపడుతున్నారనే అవినాష్ ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాజీమంత్రి వివేకాను హత్యచేయించినట్లు పదేపదే ప్రచారం చేస్తున్నారు.

అయితే హత్యకు కారణాలపై కొన్ని అంశాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. కాకపోతే వాటినే ఎంపీ ఇపుడు అధికారికంగా చెప్పారు. ఇంతకీ ఆయన చెప్పిందేమంటే వివేకాకు షేక్ షమీమ్ అనే రెండో భార్యుందట. వాళ్ళకి షేక్ షెహన్షా అనే కొడుకు కూడా ఉన్నాడట. వివేకా ఆస్తులపై  మొదటిభార్య, కూతురు సునీత, ఆమె భర్త నర్రెడ్డిరాజశేఖరరెడ్డికి  రెండో భార్యకు గొడవలవుతున్నాయట. ఆస్తులను రెండోభార్య కొడుకు పేరుతో వివేకా రాయాలని అనుకున్న నేపధ్యంలో వాళ్ళమధ్య పెద్ద గొడవలు కూడా అయ్యాయట.

ఈ కారణంతోనే వివేకాకు మొదటిభార్య, కూతురు చెక్ పవర్ కూడా రద్దుచేశారట. అలాగే వివేకాతో గొడవపడి మొదటిభార్య పులివెందల నుండి హైదరాబాద్ కు వెళ్ళి కూతురు దగ్గరే ఉంటోందట. తన పేరుతో ఉన్న ఆస్తులను మొదటిభార్య, కూతురు, అల్లుడి పేరుతో రాయాలని ఒత్తిళ్ళు వస్తుంటే వివేకా కుదరదని చెబుతున్నారట.

ఈ నేపధ్యంలోనే వివేకా హత్య జరిగిందని అవినాష్ చెప్పారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగితే చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి సునీత తనతో పాటు తన తండ్రి మీద హత్యారోపణలు చేస్తున్నట్లు ఎంపీ మండిపడ్డారు. మొదట్లో చంద్రబాబ, టీడీపీ నేతలపైన ఆరోపణలు చేసిన సునీత తర్వాత మొత్తం వ్యవహారాన్ని తనపైన అనుమానం వచ్చేట్లుగా మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తుచేస్తున్నారు. మొత్తానికి వివేకా హత్యకు కారణాలు ఇవి అంటు జనాల్లో ఎప్పటినుండో వినిపిస్తున్న కారణాలను ఎంపీ ఇపుడు చెప్పటంపై  సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: