రాబోయే ఎన్నికల్లో తన పరిపాలన ఎలా ఉండబోతోందో రాజమండ్రి మహానాడు వేదికలో చూచాయగా చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.  మ్యానిఫోస్టోలోని అంశాలగురించి శనివారం ప్రతినిధుల సభలో ట్రైలర్ విడుదలచేసినట్లుగా శాంపుల్ చెప్పారు. ఆదివారం సాయంత్రం జరగబోయే బహిరంగసభలో పూర్తిగా వివరిస్తారేమో చూడాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీల గురించి ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు.





పైగా ఇపుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలవుతున్న సంక్షేమపథకాలను మించి అమలుచేస్తానని పదేపదే చెప్పారు. చంద్రబాబు దగ్గరనుండి మాట్లాడిన ప్రతి చోటా నేత కూడా పదేపదే జగన్ ప్రస్తావన తీసుకురావటమే ఆశ్చర్యంగా ఉంది. మహానాడు పెట్టుకున్నది తమ గురించి చెప్పుకోవటానికా లేకపోతే జగన్ను తిట్టడానికా అన్నదే అర్ధంకావటంలేదు. చంద్రబాబు మాటల్లోనే సంక్షేమపథకాలను జగన్ బాగా అమలుచేస్తున్నారని అంగీకరించినట్లయ్యింది.





ఎలాగంటే ఇపుడు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలన్నా తాను సీఎంకాగానే మరిన్ని పథకాలను అమలు చేస్తానని చెప్పటమంటే అర్ధమేంటి ? ఇపుడు జగన్ సంక్షేమపథకాలను బాగానే అమలుచేస్తున్నట్లే కదా. ఇక్కడ విషయం ఏమిటంటే అధికారంలోకి వస్తే సంక్షేమపథకాలను తాను మరింత ఎక్కువగా అమలుచేస్తానని చెప్పినపుడు గతంలో సీఎంగా ఉన్నపుడు ఏమిచేశారో జనాలకు గుర్తుచేయాలి కదా ? 1995-2004 మధ్య  అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధిలోకి తెచ్చాను అని మాత్రమే చంద్రబాబు చెప్పారు. మరి 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు ఏమిచేశారనే విషయాన్ని ఎందుకని ప్రస్తావించలేదు ?





2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. పార్టీ వెబ్ సైట్ నుండి ఏకంగా మ్యానిఫెస్టోనో ఎత్తేశారు. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగభృతి, ఎన్టీయార్ క్యాంటిన్లు, డ్వాక్రా రుణాల మాఫీ ఇలా ఏ హామీ తీసుకున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలుచేయలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఘోరఓటమి. అందుకనే 2014-19 పాలన గురించి చంద్రబాబు మాట్లాడటంలేదు. తన పాలన జనాలకు ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంది. అలాంటిది రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే అద్భుతంగా పరిపాలిస్తానని చెబితే ఎంతమంది నమ్ముతారు ?

 





మరింత సమాచారం తెలుసుకోండి: