పిజ్జాను ఇష్టపడని వారు ఎవరుంటారు... ఈ పదార్దాన్ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. వేడి వేడి పిజ్జా పై టమోటా సాస్ వేసుకుని తింటే.. అబ్బో ఆ రుచిని మాటల్లో చెప్పలేం..  అయితే.. ఉత్తర కరోలినాలో నివసిస్తున్న ఓ జంట కూడా ఇదే అనుకుని ప్రిపేర్ చేసే టైం కి వారికి ఓ చేదు అనుభవం ఎదురైంది. వారికి ఎదురైన దెబ్బకు పిజ్జా అంటేనే భయపడిపోతున్నారు ఆ జంట.


అయితే ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే.. వేక్ ఫారెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్న అంబర్, రాబర్ట్ హెల్మ్ అనే జంట పిజ్జాను తయారు చేసి ఓవెన్‌ లో పెట్టారు. అయితే కొంచెం సేపు అయ్యాక ఓవెన్ నుంచి పిజ్జా గుమగుమలు కాకుండా వారికి ఏదో కాలుతున్న వాసన, ఒవేన్ నుంచి పొగలు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 


వెంటనే ఓవెన్‌ ను స్విచ్చ్ ఆఫ్ చేశారు. అనంతరం వారు ఓవెన్ తెరిచి పొగ బయటకు పోయేవరకు దాన్ని అలానే వదిలిపెట్టారు. ఆ తర్వాత ఓవెన్‌ ను పరిశీలించగా.. పిజ్జా బాగానే ఉంది. కదా.. అసలు కాలుతున్న వాసన ఎక్కడి నుంచి వస్తుందని వారు మొత్తం పరిశీలించారు. వారికి అక్కడ పిజ్జా కింద ఏదో తాడు లాంటిది కనిపించింది. 


ఇదేంటి అని దాన్ని పరిశీలనగా చూసిన ఆ జంట ఒక్కసారిగా షాకయ్యారు. అది తాడు కాదు, పామని తెలిసి కంగారు పడ్డారు. వెంటనే ఎం చేయాలో తెలియక స్నేక్ హెల్ప్‌ లైన్‌ కు ఫోన్ చేశారు. అయితే, అప్పటికే ఆ పాము ఓవెన్‌లో వేడిని తట్టుకోలేక చనిపోయింది. వీరు అడవి ప్రాంతంలో నివసిస్తుండటం వల్ల పాము.. వంటగదిలోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు. వెచ్చగా ఉంటుందని ఓవెన్‌లోకి దూరి ఉంటుందని, అది తెలియక ఆ జంట పిజ్జాను వండే క్రమంలో దాన్ని కూడా ఉడికించేశారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: