తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అయిన రఘునందన్ రావు పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనపై రఘునందన్ రావు లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ మెదక్ జిల్లా ఆర్సీపురం కు చెందిన రాధా రమణి  అనే మహిళ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.  రాధా రమని  తన భర్తతో విభేదాల కారణంగా 2003లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. రఘునందన్ రావు సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలోనే కేసు నిమిత్తం 2007 సంవత్సరంలో రఘునందన్ రావు తన ఆఫీసుకు పిలిపించి కాఫీ లో మత్తు మందు కలిపిన తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని... అక్కడితో ఆగకుండా తన నగ్న ఫోటోలు వీడియోలు ఉన్నాయని  బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేసాడు అంటూ ఆరోపించింది. కాగా సదరు మహిళ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన రాధా రమణ మరోసారి బీజేపీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది అయిన రఘునందన్ రావు పై సంచలన ఆరోపణలు చేసింది. రఘునందన్ రావు కేవలం తన పైనే కాదు...  కేసుల పరిష్కారం కోసం తన దగ్గరకు వచ్చే వారందరినీ భయపెట్టి లొంగదీసుకున్నాడు అంటూ రాధరమణి ఆరోపించింది. అయితే నిన్న పోలీస్ కేసు పెట్టగానే కేసును విత్డ్రా చేసుకోవాలి అంటూ రఘునందన్రావు బ్లాక్మెయిల్ చేసాడు అంటూ మీడియా ముందు తెలిపింది రాధారమని . అయితే రఘునందన్ రావు తీరుతో విసిగి పోయిన తాను హెచ్ఆర్సీని ఆశ్రయించాను  అంటూ తెలిపింది. హెచ్ఆర్సీ సూచనల మేరకే.. ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావు పై కేసు పెట్టాను అంటూ తెలిపింది బాధితురాలు రాధా రమణ. అయితే తన  కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను  రఘునందన్ రావు మార్చేసాడు అంటూ ఆరోపించింది.

 

 

 తన భర్త తో చేతులు కలిపి రఘునందన్ రావు తనను  కిడ్నాప్ చేశాడని ఆ తర్వాత తన భర్తతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.అయితే తన దగ్గరకు కేసుల పరిష్కారం కోరుతూ వచ్చిన మహిళలను భయపెట్టి లొంగదీసుకుంటాడు అని  ఆరోపించిన సదరూ బాధిత మహిళ... వారితో బ్లూ ఫిలిమ్స్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. హీరో రవితేజ తమ్ముడికి కూడా బ్లూ ఫిలిమ్స్ సప్లై చేసేది అడ్వకేట్ రఘునందన్ రావేనంటూ ఆరోపించింది రాధా రమణి. రఘునందన్ రావు వల్ల నాకు నా కుమారుడికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ కోరింది. అయితే బాధిత మహిళ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటివరకూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది అయిన రఘునందన్రావు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: