తెలుగు భాష అమృతం. తెలుగు పదాలు ఎంతో కమ్మగా.. అమ్మ జోలల, ఉంటాయి. అటువంటి తెలుగులో ఆమె కలం పట్టి వెనుకబడిపోతున్న స్త్రీలపై ప్రేత్యేక దృష్టి పెట్టి రాయడం  నిజముగా చెప్పుకో దగ్గ విషయమే. స్త్రీలని ఎంతో చులకనగా చూస్తున్న ఈ సమాజంలో ఆమె దృష్టి పెట్టి ఎంతో చక్కటి అక్షరాలని తన కలంతో కురిపించింది.

 

IHG

 

అయితే అప్పట్లో స్త్రీల స్థితి ఎంతో ఘోరంగా, బాధగా ఉండేది. అయితే వాటి వెనుక ఆమె దృష్టి పెట్టి చక్కటి పదాల్ని అందించింది. పోపూరి లలిత కుమారి అసలు పేరు. ఈమె ఓల్గాగా ప్రసిద్ధి చెందారు. స్త్రీవాది ధృక్పధంపై సాహిత్యం కూర్చారు. స్త్రీ వాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచారు ఓల్గా. అభ్యుదయంపై గురజాడ కన్యాశుల్కం ద్వారా ఈమెకి ఆసక్తి కలిగింది.

 

ఈమె తెలుగు సాహిత్యం లో ఎం.ఎ  చేసారు. ఆ తర్వాత అధ్యాపకురాలిగా పని చేసారు. ఓల్గా కధలు, నవలలు, పద్యాలూ మహిళా సాహిత్యంలో విననివి. అంత గొప్పగా ఈమె తన రచనల్ని అందించింది. రాజకీయ కధలు, స్వేచ్చ, సహజ, ప్రయోగం, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, ఆకాశంలో సగం, పలికించు మౌన మృదంగాలు, అలజడి మా జీవితం, అక్షర యుద్ధాలు ఇలా ఎన్నో రచనలు ఓల్గా రచించారు. ఇలా ఆమె స్త్రీల సమస్యలపై రచనలు చేసారు. 

 

IHG

 

ఈమె సాహిత్యంలో ఎనలేని సేవ చేసారు. 1987  సంవత్సరంలో స్వేచ్ఛ నవలకి ఉషోదయ పబ్లికేషన్స్ వారు ఉత్తమ నవల రచయత అవార్డు ఇచ్చారు. 1990  సంవత్సరంలో ఉదయం మ్యాగజిన్ వారు ఉత్తమ నవల రచయిత అవార్డు ఇచ్చారు. 1998  లో తోడు అనే కధకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చారు. 1999  లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ స్త్రీ అవార్డు అందుకున్నారు. 2015  లో విముక్త కధల సంపుటికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: