ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలన్నీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇక గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై  నిరాశ చెందిన పార్టీలన్ని  ఈ సారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నో సర్దుబాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన టిడిపి పార్టీ ల మధ్య సర్దుబాటు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మామూలుగానే రాజకీయాలు అన్న తర్వాత తెరవెనుక ఒప్పందాలు తెర ముందు  ఒప్పందాలు ఉంటాయి  అన్న విషయం తెలిసిందే. 

 


 ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాల్లో  ఇలాంటివే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన టిడిపి మధ్య సర్దుబాటు లో భాగంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సర్దుబాటు చేసుకున్నట్లు అటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ స్పెక్టేటర్  పాత్ర అయింది. ఇక ఉత్తరాంధ్ర విషయానికొచ్చేసరికి బిజెపి జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీతో ఈ రెండు పార్టీలలో  ఒకరు సర్దుబాట్లు చేసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమ విషయానికి వస్తే దాదాపుగా తెలుగుదేశం పార్టీ చేతులెత్తెయ్యగా  బిజెపి జనసేన పార్టీలలో  ఎవరు పోటీ చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. 

 

 అయితే ఈ మూడు పార్టీలు సర్దుబాటు చేసుకుని ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో.. వైసీపీ పార్టీ అసలు ప్రత్యర్థి అభ్యర్థి ఉండకుండా చేసుకునేందుకు దాడులు చేయడం పేపర్ లు లాక్కోవడం నామినేషన్ పత్రాలు చించేయటం లాంటివి జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్న ఎన్నికల సంఘం మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వీటన్నింటినీ కళ్ళారా చూస్తున్న ప్రజలు ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నప్పటికీ ఈ బంధాన్ని ప్రజలు ఆక్సెప్ట్ చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూడు పార్టీలు కూటమిగా లేనప్పటికీ ఈ మూడు పార్టీలలో సరైన అభ్యర్థులు ఎవరనే దానిపై క్లారిటీ తెచ్చుకుని ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధపడ్డారు అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: