ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో 3000 లకు పైగా మరణించారు..అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన ఈ కరోనా ప్రజలు భపడుతున్నారు. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు..



 

కొనేదల ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. తినే ఆహార పదార్థాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు..

 

 

ఇకపోతే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు...జిల్లాలో తొలి కరోనా వైరస్‌ నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చిన వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది.



 

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా తగ్గక పోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేల్చారు. అయితే... మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకి తరలించారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఆ యువతి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని భావిస్తున్నారు.జలుబు జ్వరం విపరీతమైన దగ్గు ఉంటే వెంటనే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించాలి అని సూచిస్తున్నారు.. పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టు పక్కల పరిసరాలను అని వారు చెబుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: