ముంబై డబ్బావాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్యాలయాలు, పాఠశాలలకు టిఫిన్‌ బాక్స్‌లను డెలివరీ చేస్తోంది. దీని ద్వారా ఎంతో మంది తమ జీవనోపాది కొనసాగిస్తున్నారు. ఆఫీసుల్లో పని చేస్తున్న వారికి వారివారి ఇళ్ల నుంచి వేడివేడి ఆహారాన్ని తీసుకొచ్చి అందించడం వీరి వృత్తి. దశాబ్దాలుగా డబ్బావాలాలు ఈ పనిలో ఉన్నారు.  ఇదే వృత్తిగా పెట్టుకొని వంద ల కుటుంబాలు దీనిపై ఆదారపడి ఉన్న విసయం తెలిసిందే. ముంబై వాసులకు వీరితో ఎంతో అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నిత్యం టెన్షన్ గా ఆఫీసు, ఇతర కార్యాలయాలకు వెళ్లిన వారికి డబ్బావాల తెచ్చే బోజనమే దిక్కు.  అలాంటి డబ్బా వాలలపై కూడా కరోరా మహమ్మారి ఎఫెక్ట్ చూపించింది. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, వారు కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

మార్చి 31వ తేదీ వరకు తమ విధులను నిలిపివేయాలని వారు నిర్ణయించారు.  ఇప్పటికే మహరాష్ట్రలో కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు.  దేశ వ్యాప్తంగా ఎక్కవ కేసులు మహారాష్ట్రలోనే నమోదు అయిన విషయం తెలిసిందే.  మొన్నటి వరకు ముంబాయలో భారీ వర్షాల కారణంగా నానా ఇబ్బందులు పడ్డ ఈ డబ్బా వాలాలు ఇప్పుడు కరోనా తాకిడికి మరోసారి చిక్కుల్లో పడ్డారు.  భారీ వర్షాలు కుదిపేస్తున్న సమయంలో కూడా డబ్బావాలాలు తమ సేవలను కొనసాగించారు.

 

ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంత వాన నీటిలో కూడా డబ్బా వాలాలు నానా కష్టాలు పడుకుంటూ తమ సేవలు కొనసాగించారు.  కానీ ఈ మాయదారి కరోనా వల్ల కష్టాలు తప్పని పరిస్థితికి వచ్చింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా మారతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సేవలను బంద్ చేయాలని నిర్ణయించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తమపై పడటంపై ఇప్పుడు డబ్బా వాలకు కన్నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: