ఏపీలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. జనజీవనం ఇళ్లకే పరిమితమైంది. స్కూళ్లు, కాలేజీలు లేవు. ఊళ్లకు ప్రయాణాలు లేవు. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు మూతబడ్డాయి. ఆరుబయట పనులు రద్దు. ఆఫీసు పనులు ఇళ్లలోంచే. పెళ్లిళ్లూ పండుగలూ ఆత్మీయులతో కలయికలూ అన్నీ బందవుతున్నాయి. శనివారం వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా 597267 లక్షల మందికి సోకింది. ఇందులో 27365 మంది మరణించారు. ఇందులో అత్యధికులు యూరప్ దేశలకు చెందిన వారే కావడం అక్కడ మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది.

 

కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో వసతులు, భోజనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అయితే  14 రోజులు క్వారంటైన్ కు సిద్ధ పడేవారికి ఏపీలోకి అనుమతినివ్వాలని చెప్పారు.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై జగన్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు.  

 

వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు, మొబైల్ నిత్యావసరాల దుకాణాలను తీసుకెళ్లగలం అన్న ధీమా ఉన్నప్పుడే సమయం తగ్గించే ఆలోచన చేద్దామని సీఎం స్పష్టం చేశారు. సమయాన్ని తగ్గిస్తే ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే అవకాశముందని, తద్వారా జనసమూహాలు ఏర్పడేందుకు తామే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని సీఎం మంత్రులకు వివరించారు.  ప్రజలను తమను తాము కాపాడుకునే పరిస్థితి అని.. కరోనాని అంత తేలిగ్గా తీసుకోవొద్దని అన్నారు సీఎం జగన్. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: