డ్రాగ‌న్ కంట్రీ చైనా సృష్టించిన (!) కరోనా ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. వేల కొద్ది మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా చైనా ప‌రువు గంగ‌పాలు అవుతోంది. ఆ దేశాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు చీ కొడుతున్నారు. ఉత్ప‌త్తుల రంగంలో చైనా పేరెన్నిక‌గ‌న్న‌ది అనే సంగ‌తి తెలిసిందే. అయితే,  తయారు చేసిన  వైద్య పరికరాలు, ఫేస్ మాస్కులు, టెస్ట్ కిట్లు సరఫరా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, చైనా పంపిన కరోనా వైరస్ నిర్ధారణ టెస్టు కిట్లు నాసిరకంగా ఉండడంతో యూరోపియన్ దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా పంపిన కిట్లు వాడొద్దని మొదటి సారిగా నెదర్లాండ్స్ నిర్ణయించుకుంది. డచ్ ప్రభుత్వం ఇప్పటికే చైనా పంపిన FFP2 మాస్క్ లను వాడొద్దని ప్రకటించింది. బెల్జియం, ఇటలీ, స్పెయిన్ దేశాలు మాస్కులను, వైరస్ వ్యాధి నిర్ధారణ కిట్లను తిరిగి పంపించాయి. ఈ అవ‌మానంతో చైనా బుద్ధి మార్చుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.

 

ఇదిలాఉండ‌గా, క‌రోనా పుట్టినిల్లు అయిన వుహాన్‌లో ప్ర‌జ‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంది. కోవిడ్‌-19 బారిన పడి  మరణించినవారి నుంచి వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు కఠినంగా వ్యవహరించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటంతో మరణించినవారిని కుటుంబసభ్యులకు అందించకుండానే అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయుల అంత్యక్రియలకు స్మశానానికి కూడా వెళ్లలేక కుటుంబసభ్యులు ఇంటిలోనే ఏడ్చుకుంటూ ఉన్నారు. 

 

కాగా, తాజాగా ప్రజల సంచారంపై ఆంక్షలను సడలించటంతో వుహాన్‌లోని స్మశానవాటికల వద్ద కరోనా మృతుల బంధువులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఒక స్మశాన వాటిక వద్ద రెండు రోజుల్లో 2500 మంది మృతులకు సంబంధించిన చితాభస్మాలను వారి బంధువులకు అందజేసినట్లు వెల్లడించింది. మరో చోట 3500 మంది మృతులకు సంబంధించిన వస్తువులను వరుసగా పేర్చిన ఫోటోను కూడా ఆ సంస్థ ప్రచురించింది.  చాలామంది కుటుంబసభ్యులు తమవారి చివరి జ్ఞాపకాల కోసం రెండుమూడు గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: