అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. చైనాలో పుట్టి అంతకంటే ఎక్కువగా ఇటలీ, స్పెయిన్ లలో మరణ మృదంగం మోగించిన కరోనా ధాటికి ఇప్పుడు అమెరికా అతి పెద్ద బాధితురాలు అయ్యింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో కరోనాతో ఎక్కువ మంది మరణించిన దేశంలో అమెరికా రికార్డు కెక్కింది. నిన్నటి వరకూ ఇటలీలో ఎక్కువగా కరోనా మృతుల సంఖ్య ఉండేది. దాన్ని ఇప్పుడు అమెరికా దాటేసింది.

 

 

ప్రస్తుతం అమెరికాలో ఐదు లక్షలకుపైగా కరోనా కేసులు ఉంటే.. కరోనాతో మరణించిన వారి సంఖ్య దాదాపు 20 వేలకు చేరకుంది. ఇటలీలో ఈ సంఖ్య 19 వేల 500 వరకూ ఉంది. అంటే కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా తల్లకిందులవుతోందన్నమాట. రోజూ వేల సంఖ్యలో కరోనా కాటుకు బలవుతున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి పంజాకు మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

 

 

అమెరికాలో ఈ కరోనా శరవేగంగా వ్యాపిస్తూ ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా జోరు తగ్గడం లేదు. శుక్రవారంతో ఈ మహమ్మారి పొట్టన పెట్టుకున్న వారి సంఖ్య లక్ష దాటింది. దాదాపు ప్రపంచ దేశాలన్నింటినీలోనూ ప్రవేశించిన వైరస్.. ప్రత్యేకించి అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్, చైనా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. శనివారం రాత్రికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 17.5 లక్షలు. అమెరికా, ఇటలీ తర్వాత ఎక్కువగా స్పెయిన్ లో ప్రాణ నష్టం సంభవించింది. ఈదేశంలో 16.5 వేల మంది వరకూ చనిపోయారు.

 

 

ఫ్రాన్స్, లండన్, ఇరాన్, బెల్జియం దేశాల్లోనూ వేల సంఖ్యలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే లండన్‌లో దాదాపు 900 మందికి పైగా మరణించారు. ఈ దేశంలో కరోనా మృతుల సంఖ్య 10వేలకు చేరువైంది. అసలు కరోనా పుట్టిల్లు చైనాలో మాత్రం కొత్తగా కేవలం 3 మరణాలు సంభవించాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: