చాలామంది శృంగారాన్ని ఏదో హ‌డివిడిగా చేసేస్తారు. ప‌నైందా లేదా అన్న‌ట్లు త్వ‌ర‌గా ముగించుకుని ప‌క్క‌కు వెళ్ళిపోతారు. కానీ అది స‌రైన ప‌ద్ధ‌తి కాదు అంటున్నారు నిపుణులు. మగువను మురిపించి శృంగారం వైపు తీసుకెళ్లడంలో వేగం ఉండవచ్చునేమో గానీ అసలైన శృంగారం స్లోగానే మొదలుపెట్టి... సుధీర్ఘంగా సాగించాలని పురుషులకు సలహాలిస్తున్నారు శృంగార రంగ పరిశోధకులు.

 

సెక్స్ ఈజ్ నాట్ ఏ రేస్.. అని అంటున్నారు. శృంగారంలో స్పీడు అస్సలు పనికిరాదని చెబుతున్నారు. మ‌గ‌వారు శృంగారంలో దూకుడుగా వెళ్లడం వల్ల మ‌హిళ‌ల‌ కు పెద్ద ఆనందం ఉండదని వీరు తేల్చిచెబుతున్నారు. నెమ్మదిగా, సుతారంగా మొదలుపెట్టాలని, అందాలను ఎక్స్‌ప్లోర్ చేయాలని.. సన్నిహితంగా గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో మధురంగా మార్చాలని.. అప్పుడే మజా ఉంటుంద‌ని అని వివరిస్తున్నారు. ఈ మాటలు చెబుతుంటేనే మత్తెక్కుతోందంటే.. అనుసరిస్తే ఇంకెంత మజా ఉంటుందో ఓ సారి ఆలోచించ‌మంటున్నారు నిపుణులు.

 


కొంత కాలం దాంప‌త్య జీవితాన్ని గ‌డిపిన త‌ర్వాత‌ స్త్రీ, పురుషులిద్దరూ సెక్స్ గురించి మాట్లాడుకోవడం చాలా మంచిదని ఎక్స్‌పర్ట్లు చెబుతున్నారు. లైంగిక ఇష్టాలను తెలుసుకోవడంతో మొదలుపెట్టి నిధానంగా అక్క‌డి నుంచి డర్టీ టాక్ వరకూ వెళ్లడం ఏ మాత్రం డర్టీ కాదని నొక్కివక్కాణిస్తున్నారు. శృంగారంలో పరస్పర ఇష్టాల పై అవగాహన ఉండటం ఎంతో మంచి విష‌య‌మ‌ని చెబుతున్నారు.

 

ఒక్కోసారి ఆమెలీడ్ తీసుకుంటే క‌నుక‌ ఇది సెక్స్ ను మరింత మధురానుభూతిగా మార్చగలదని హామీ ఇస్తున్నారు. అలా ఆమె చొరవ తీసుకునేలా చేయగలగడం మళ్లీ మగవాడి చేతిలోని అంశమే అంటున్నారు. అందుకు అవకాశం ఇచ్చే మనస్తత్వం క‌లిగి ఉండాల‌ని మగవాళ్లకు చెబుతున్నారు నిపుణులు.

 

దీర్ఘకాల బంధాల్లో శృంగారం అనేది మరీ రొటీన్ కాకుండా ఉండాలంటే శృంగార వేదికను మార్చడమే మార్గం అని చెబుతున్నారు. బెడ్రూమ్ కాకుండా ఎక్కడ? అనే అంశంపై మీ ఆలోచనలు సాగే తీరే మీరెంత రసికులో అర్థం అయ్యేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్లేస్ లో కొత్త ఎనర్జీ, ఇంట్రస్ట్ కలుగుతుంది, కొత్తగా ఉంటుందని మాత్రం నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: